Share News

Ramesh Naidu: జగన్, కేసీఆర్ ఒకరింటికి ఒకరెళ్లి చేపల పులుసు తిన్నారే తప్ప...

ABN , Publish Date - Jul 06 , 2024 | 01:14 PM

Andhrapradesh: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అవ్వడం సంతోషమని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్, కేసీఆర్ ఒకరి ఇంటికి ఒకరు వెళ్లి చాపల పులుసు తిన్నారని.. సమస్యల పరిష్కారానికి ఏరోజు చిత్తశుద్ధితో పాటు పడలేదని విమర్శించారు.

Ramesh Naidu: జగన్, కేసీఆర్ ఒకరింటికి ఒకరెళ్లి చేపల పులుసు తిన్నారే తప్ప...
BJP Leader Ramesh Naidu

న్యూఢిల్లీ, జూలై 6: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అవ్వడం సంతోషమని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు (BJP Leader Ramesh Naidu) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ (AP Former CM Jagan), కేసీఆర్ (Telangana Former CM KCR) ఒకరి ఇంటికి ఒకరు వెళ్లి చేపల పులుసు తిన్నారని.. సమస్యల పరిష్కారానికి ఏరోజు చిత్తశుద్ధితో పాటు పడలేదని విమర్శించారు. రాజకీయ పబ్బం కోసం అప్పుడప్పుడు కొన్ని విద్వేషపరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్నారు. జగన్ ఏపీలో సీఎం కావాలని కేసీఆర్, కేటీఆర్ (KTR) కోరుకున్నారని ఆయన అన్నారు.

BRS: కీలక సమావేశానికి ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డుమ్మా..!


కాపలా కుక్కల్లా ఆ ఇద్దరు...

తెలంగాణ ఎన్నికల(Telangana Elections) సందర్భంగా నాగార్జున సాగర్ మీదకు ఆంధ్ర పోలీసులను రప్పించారని మండిపడ్డారు. ఏపీ భవన్ విభజనకు పదేళ్ళలో ఎప్పుడూ కూడా గత ప్రభుత్వాలు ప్రయత్నం చేయలేదన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu Naidu) నిర్ణయాన్ని బీజేపీ (BJP) స్వాగతిస్తోందని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ఇరు రాష్ట్రాల సీఎంలు కృషి చేస్తున్నారన్నారు. జగన్, కేసీఆర్ కాపలా కుక్కల్లాగా సిద్ధంగా ఉన్నారని.. దేనికంటే ఇద్దరు సీఎంలు తీసుకునే నిర్ణయాలను ఏదో ఒక అంశంలో రాజకీయ ప్రయోజనాల కొరకు వ్యతిరేకించాలని అనుకుంటున్నారని ఘాటుగా విమర్శలు గుప్పించారు. అవసరమైతే మరో 10 సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డికి (Telangana CM Revanth Reddy) విజ్ఞప్తి చేశారు. సమస్యలు పరిష్కారం కావాలని.. రెండు ప్రాంతాల బంధం ఇంకా బలోపేతం కావాలని ఆకాంక్షించారు. చంద్రబాబు నాయుడు ప్రధానితో సహా కేంద్రంలో అందరు మంత్రులను కలిశారని బీజేపీ నేత వెల్లడించారు.

Kodali Nani: కొడాలి నానికి మరో బిగ్ షాక్..


అభివృద్ధికి బాబు చిరునామా...

చంద్రబాబు నాయుడు అభివృద్ధికి ఒక చిరునామా అని చెప్పుకొచ్చారు. సహకారం అందించడంలో ప్రధాని మోదీనీ (PM Modi) మించిన వారు ఎవరూలేరని కొనియాడారు. కేంద్రంలో ఉన్న ప్రతిశాఖకు మౌఖిక ఆదేశాలు వెళ్ళాయన్నారు. ఏపీ నష్ట పోయిందని.. జగన్ వ్యవస్థలను నిర్వీర్యం చేశారని.. ఆర్థికంగా రాష్టం దివాలా తీసే విధంగా చేశారని విమర్శలు గుప్పించారు. 60 వేల కోట్ల రూపాయల హైవే ప్రాజెక్టులను వెంటనే ఆమోదం తెలిపారన్నారు. 2014లో కూడా టీడీపీ, బీజేపీ, జనసేన డెడ్లీ కాంబినేషన్ అన్నారు. రాష్ట్రంలో అనేక మౌలిక సదుపాయాలు అందబోతున్నాయని అర్థమవుతోందని రమేష్ నాయుడు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

Mukesh Ambani Viral Video: మనుమళ్లు, మనుమరాళ్లతో ముకేష్, నీతా అంబానీల సంగీత్..

Gold: అతి తెలివితో నగలు కొట్టేసిన మహిళలు... కంగుతిన్న యాజమాన్యం

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 06 , 2024 | 02:00 PM