Share News

CM Chandrababu: నలుగురు విద్యార్థుల మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

ABN , Publish Date - Aug 19 , 2024 | 02:49 PM

Andhrapradesh: అనాథాశ్రమంలో కలుషిత ఆహారంతో నలుగురు విద్యార్థుల మృతిచెందడంపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అస్వస్థతకు గురైన ఇతర విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

CM Chandrababu: నలుగురు విద్యార్థుల మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
CM Chandrababu Naidu

అమరావతి, ఆగస్టు 19: అనాథాశ్రమంలో కలుషిత ఆహారంతో నలుగురు విద్యార్థుల మృతిచెందడంపై సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అస్వస్థతకు గురైన ఇతర విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనకాపల్లి జిల్లా, కోటవురట్ల మండలం కైలాస పట్టణంలోని అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని నలుగురు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసిన సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Vishnukumar Raju: జగన్‌పై విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు


రెండు రోజుల క్రితం కలుషిత ఆహారంతో అస్వస్థకు గురై చికిత్స పొందుతున్న వారిలో జాషూవా, భవాని, శ్రద్ధ, నిత్య అనే విద్యార్థులు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. నర్సీపట్నం, అనకాపల్లి ఏరియా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఘటనకు గల కారణాలపై పూర్తి నివేదిక అందించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు..


కాగా... అనకాపల్లిలోని అనాథాశ్రమంలో చుట్టపక్కల ఉన్న చిన్నారు చదువుకుంటుంటారు. ఈ క్రమంలో ఆదివారం కలుషిత ఆహారం తిని నలుగురు మృత్యువాతపడగా.. దాదాపు 27 మంది అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం మధ్యాహ్నం ఆహారంతో పాటు సమోసాలను చిన్నారులు తిన్నారు. ఆ వెంటనే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో వెంటనే ఆశ్రమ నిర్వాహకుడు వాళ్లను ఇంటికి పంపించి వేశారు. ఇంటికి వెళ్లిన వెంటనే నలుగురు చిన్నారుల పరిస్థితి విషమంగా మారింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ వారు మృతిచెందారు. మిగిలిన విద్యార్థులు నర్సీపట్నం, అనకాపల్లి ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.


ఇవి కూడా చదవండి..

Durgamma Temple: ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న పవిత్రోత్సవాలు

Seethakka: ఆడబిడ్డలను ఎగరనిద్దాం.. అందరికీ రాఖీ శుభాకాంక్షలు

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 19 , 2024 | 02:53 PM