Vijayawada: తెలుగు వారు ఉన్నంత వరకూ గుర్తుండే పేరు ఎన్టీఆర్: సీఎం చంద్రబాబు..
ABN , Publish Date - Dec 14 , 2024 | 08:21 PM
తెలుగు జాతి ఉన్నంత వరకూ గుర్తుండే పేరు "ఎన్టీఆర్" అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సినిమాల్లో ఎన్టీఆర్ అనేక పాత్రలు పోషించి మెప్పించారని చంద్రబాబు కొనియాడారు. రాముడు, కృష్ణుడు వంటి అనేక పాత్రలు పోషించి తెలుగువారు పూజించే స్థాయికి ఆయన ఎదిగారని చెప్పారు.
విజయవాడ: తెలుగు జాతి ఉన్నంత వరకూ గుర్తుండే పేరు "ఎన్టీఆర్" అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సినిమాల్లో ఎన్టీఆర్ అనేక పాత్రలు పోషించి మెప్పించారని చంద్రబాబు కొనియాడారు. రాముడు, కృష్ణుడు వంటి అనేక పాత్రలు పోషించి తెలుగువారు పూజించే స్థాయికి ఆయన ఎదిగారని చెప్పారు. ఎన్టీఆర్ రూపంలోనే దేవుళ్లను చూస్తున్నామని చంద్రబాబు అన్నారు. సుమారు 300 సినిమాల్లో నటించి ప్రజలను ఆయన అలరించాలని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. విజయవాడ మురళీ రిసార్ట్స్‌లో జరుగుతున్న ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా "తారక రామం" అనే పుస్తకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఎన్టీఆర్ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని సీఎం చంద్రబాబు అన్నారు. 1945 మద్రాసు రైలు ఎక్కిన తర్వాత ఎన్టీఆర్ జైత్రయాత్ర ప్రారంభమైందని చెప్పుకొచ్చారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ 10పైగా సినిమాల్లో నటించేవారని చెప్పారు. ఓ వైపు రాముడు, కృష్ణుడు వంటి దేవుళ్ల పాత్రలు చేస్తూనే మరోవైపు రావణాసురుడు, దుర్యోదనుడు వంటి పాత్రలను సైతం పోషించి మెప్పించారని కొనియాడారు. దాన వీర సూర కర్ణలో మూడు పాత్రలు చేసి అందరి మన్ననలు పొందారని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి:
TDP: సరికొత్త రికార్డు సృష్టించిన టీడీపీ పార్టీ.. ఏకంగా..
CM Chandrababu: అల్లు అర్జున్‌కు ఫోన్ చేసిన సీఎం చంద్రబాబు.. ఎందుకంటే..