Share News

CM Chandrababu: గుడ్లవల్లేరు ఘటనపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Sep 01 , 2024 | 05:37 PM

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్‎గా తీసుకుని విచారణ చేపట్టింది. ఇందులో అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.

CM Chandrababu: గుడ్లవల్లేరు ఘటనపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

విజయవాడ: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్‎గా తీసుకుని విచారణ చేపట్టింది. ఇందులో అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు వేగంగా జరుగుతోంది. ఈ ఘటనను స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు.


మరోవైపు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనలో అసలు ఏం జరిగింది?. విద్యార్థినులు ఎందుకు అంతలా ఆందోళన చెందారు?. హిడెన్ కెమెరా ద్వారా పెద్ద ఎత్తున వీడియోలు లీక్ అయ్యాయనే ప్రచారం ఎలా మొదలైంది?. ఇందులో ఎంతవరకు నిజం ఉంది?.. ఇలా అన్నిఅంశాలపై పోలీసు అధికారులు సమగ్రంగా విచారణ జరుపుతున్నారు.


దుష్ప్రచారం చేయొద్దు...

గుడ్లవల్లేరు ఘటన దారుణమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఓ ఎస్ఐ విద్యార్ధినులతో కొంచెం పద్ధతిగా వ్యవహరించి ఉంటే బాగుండేదని తెలిపారు. అన్ని హాస్టళ్లల్లో ఇలా జరుగుతోందని కొంతమంది వ్యక్తులు దుష్ప్రచారం చేయడం కరెక్ట్ కాదని అన్నారు. 300 వీడియోలు ఉన్నాయంటూ ఏదేదో చెబుతున్నారని చెప్పారు. ఆడబిడ్డలను అపహస్యం చేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గుడ్లవల్లేరులో నిజాలను నిగ్గు తేల్చేందుకు ఓ టెక్నికల్ నిపుణుల టీంను వేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్ఫష్టం చేశారు.


అనుమానితులపై విచారణ..

అనుమానితుల గాడ్జెట్లను పరిశీలిస్తామని అన్నారు. వైసీపీ నేతలు దుష్ప్రచారం చేయడమే కాదు.. కుట్రలు పన్నుతారని ధ్వజమెత్తారు. మాజీ సీఎం జగన్ బాబాయ్ వివేకా హత్య కేసులో తన విషయంలోనే కుట్ర చేశారని ఆయన విమర్శలు చేశారు. ఏపీలో జరిగిన వివిధ ఘటనల్లో వైసీపీ ఉందనే అనుమానాన్ని కొట్టిపారేయలేమని చంద్రబాబు అన్నారు. ఇప్పటికే రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారని.. ఇంకా కుట్రలు పన్నుతున్నారని సీఎం చంద్రబాబు ఆరోపణలు చేశారు.

Updated Date - Sep 01 , 2024 | 09:53 PM