Share News

CM Chandrababu: వారి సేవలు మరువలేనివి

ABN , Publish Date - Dec 15 , 2024 | 11:44 AM

పొట్టి శ్రీరాములు సాగించిన మహత్తర పోరాటం మరువలేదని సీఎం చంద్రబాబు అన్నారు. తెలుగువారి ప్రతిష్టకోసం ప్రాణత్యాగం చేసి అమరుడయ్యారని అన్నారు. త్యాగమూర్తుల జీవితాలను మనం ఆదర్శంగా తీసుకోవాలని సీఎం చంద్రబాబు తెలిపారు.

CM Chandrababu: వారి సేవలు మరువలేనివి

అమరావతి: పొట్టి శ్రీరాములు వర్థంతిని ఆత్మార్పణ దినంగా పాటిస్తూ ప్రత్యేక కార్యక్రమాలను ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇవాళ(ఆదివారం) ఉదయం 11 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. పొట్టి శ్రీరాములు 72వ వర్థంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. ఉమ్మడి మద్రాసు నుంచి తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కోసం.. పొట్టి శ్రీరాములు సాగించిన మహత్తర పోరాటం మరువలేనిదని చంద్రబాబు అన్నారు. తెలుగువారి ప్రతిష్టకోసం ప్రాణత్యాగం చేసి అమరుడయ్యారని అన్నారు. త్యాగమూర్తుల జీవితాలను మనం ఆదర్శంగా తీసుకోవాలని సీఎం చంద్రబాబు తెలిపారు.


తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు: నారా లోకేష్

nara lokesh.jpg

భాషాప్రయుక్త రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్థంతి సందర్భంగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నివాళులు అర్పించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహారదీక్ష చేసి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. ఆయన వర్థంతిని ఆత్మార్పణ సంస్మరణ దినంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా మహనీయుని సేవలను స్మరించుకుందామని నారా లోకేష్ అన్నారు.


సర్దార్ వల్లభాయ్ పటేల్ నేటి తరానికి స్ఫూర్తిదాయకం: నారా లోకేష్

స్వాతంత్ర్య సమరయోధుడు, రాజనీతిజ్ఞుడు, న్యాయవాది, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఘన నివాళులర్పించారు. బ్రిటిష్ వారి మెడలు వంచి ప్రజల మదిలో సర్దార్‌గా నిలిచిపోయారని తెలిపారు. దేశ ప్రజల సమైక్యత కోసం ఆయన చేసిన సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వారి సేవలను మంత్రి నారా లోకేష్ గుర్తుచేసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగిత్యాలలో ఆదివారం ఎమ్మెల్సీ కవిత పర్యటన

చంద్రబాబు: నాడు, నేడు, రేపు..

ఆస్తి కోసం కన్నవారిని కడతేర్చాడు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 15 , 2024 | 01:49 PM