Share News

AP Govt: విజయవాడ వరద బాధితులకు పరిహారం విడుదల..

ABN , Publish Date - Oct 25 , 2024 | 02:24 PM

Andhrapradesh: విజయవాడ వరద బాధితులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మరికొంత మంది వరద బాధితులకు ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. దాదాపు రూ. 2.5 కోట్ల పరిహారాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది.

AP Govt: విజయవాడ వరద బాధితులకు పరిహారం విడుదల..
AP Government

అమరావతి, అక్టోబర్ 25: విజయవాడ వరద బాధిత ప్రజల్లో మరికొంత మందికి ప్రభుత్వం (AP Govt) పరిహారం విడుదల చేసింది. శుక్రవారం మరో 1501 మందికి రూ.2.5 కోట్ల పరిహారం విడుదలైంది. 1501 మంది బాధితులకు వారి అకౌంట్లకు ఈరోజు నగదును సర్కార్ బదిలీ చేసింది. ఇందులో బ్యాంక్ అకౌంట్ ఇనాక్టివ్‌గా ఉన్న కారణంతో 143 మందికి లబ్ధిదారుల అకౌంట్లలో పరిహారం జమ అవ్వలేదని అధికారులు గుర్తించారు. వీరికి సంబంధించి మరోసారి బ్యాంకు వివరాలు తీసుకుని పరిహారాన్ని అందించనున్నారు.

YS Jagan vs YS Sharmila: వైఎస్ఆర్ అభిమానులకు షర్మిల బహిరంగ లేఖ..


బ్యాంకు అకౌంట్లు అందుబాటులో లేని మరో 256 మంది అర్హుల వివరాలను ఆయా సచివాలయాలు, ప్రభుత్వ వెబ్‌సైట్ ద్వారా ప్రభుత్వం వెల్లడించనున్నారు. బ్యాంక్ అకౌంట్ వివరాలు అందించి ఈ 256 మంది తమకు వచ్చే పరిహారం పొందవచ్చని అధికారులు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పరిహారం అందాలన్న సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా అధికారులు వెల్లడించారు. పరిహారం అందజేతపై తాజా వివరాలు ముఖ్యమంత్రి కార్యాలయానికి జిల్లా అధికారులు తెలియజేశారు.


కాగా.. విజయవాడలో వరదలు ఎంతటి బీభత్సాన్ని సృష్టించాయో అందరికీ తెలిసిందే. విజయవాడను వరదలు ముచ్చెత్తడంతో ప్రజలు అల్లాడిపోయారు. వరద ఉధృతితో విజయవాడ వాసులు సర్వం కోల్పోయారు. విజయవడ వరద పరిస్థితిపై వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం.. సీఎం సహా, అధికారులు అంతా వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకంగా పది రోజుల పాటు అక్కడే ఉంటూ.. వరద ముంపు ప్రాంతాల్లో తిరుగుతూ బాధితులను పరామర్శించారు. అంతేకాకుండా వరద ఉధృతితో సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. వారికి వరద సహాయాన్ని సర్కార్ ప్రకటించింది. ఈ మేరకు సెప్టెంబర్‌లో విజయవాడలోని 179 సచివాలయాల పరిధిలోని ప్రజలకు వరద సహాయాన్ని వారి ఖాతాల్లో వేశారు.

Nadendla: ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన


ఇళ్లు, దుకాణాలు, తోపుడు బళ్లు, వ్యాపారాలు, చిన్న తరహ పరిశ్రమలు, వాహానాలు, పంటలు, పశువులకు ఆర్థిక సాయం అందించింది. వరదలు వచ్చిన 15 రోజుల్లోనే బాధితులకు వారి ఖాతాల్లో వరద సహాయాన్ని జమ చేసింది సర్కార్. మొత్తం రూ.618 కోట్లను పరిహారంగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. విడతల వారీగా ప్రభుత్వం లబ్దిదారుల ఖాతాల్లో డబ్బును జమచేస్తోంది. ముందుగా రూ.602 కోట్లను జమ చేసిన సర్కార్.. ఆ తరువాత రూ.9 కోట్లు.. ఆపై రూ. 16 కోట్లను లబ్దిదారుల ఖాతాల్లో జమచేసింది. మొత్తం 4,19,528 మందికి ప్రభుత్వం పరిహారం అందజేసింది. అలాగే తాజాగా 2954 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 1646 మందిని అర్హులుగా గుర్తించారు. వారిలో ప్రస్తుతం 1501 మంది బాధితులకు రూ.2.5 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం అందజేసింది.


ఇవి కూడా చదవండి..

Tirumala: శారదా పీఠం అక్రమ నిర్మాణాల కూల్చివేతకు రంగం సిద్ధం

Telangana: కేటీఆర్ పరువు నష్టం కేసులో మంత్రి సురేఖకు షాక్..

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 25 , 2024 | 02:32 PM