CM Chandrababu: ‘తొలి సంతకాలు’ వాటిపైనేనా..?
ABN , Publish Date - Jun 12 , 2024 | 03:17 AM
ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు గురువారం తొలి సంతకాలు చేయనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు సంబంధించిన ఫైళ్లపై ప్రమాణ స్వీకార వేదికపైనే సంతకం చేయాలని తొలుత భావించారు.
డీఎస్సీ, పింఛను పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్
అమరావతి, జూన్ 12: ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు గురువారం తొలి సంతకాలు చేయనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు సంబంధించిన ఫైళ్లపై ప్రమాణ స్వీకార వేదికపైనే సంతకం చేయాలని తొలుత భావించారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ కార్యక్రమాన్ని కేవలం ప్రమాణ స్వీకారానికి మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించారు. బుధవారం ఉదయం సీఎంగా ప్రమాణం చేసిన అనంతరం ఆయన తిరుమల వెళతారు.
గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని, అక్కడి నుంచి బయల్దేరి 10.45 గంటలకు అమరావతి సచివాలయానికి చేరుకుంటారు. సచివాలయ ఉద్యోగుల స్వాగత కార్యక్రమం పూర్తి కాగానే ఒకటో బ్లాకులోని సీఎం కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ... ‘డీఎస్సీ నోటిఫికేషన్’పైనే తొలి సంతకం పెడతానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు... సంబంధిత ఫైలుపై సంతకం చేస్తారు. ఆ తర్వాత... సామాజిక పింఛను రూ.4వేలకు పెంపు, నైపుణ్యాభివృద్ధి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతోపాటు మరో ఫైలుపై ఆయన సంతకం చేసే అవకాశముంది.