Share News

Breakingnews: ఏపీ మంత్రి మాటల దాడి... బ్లాక్ చేసేసిన కేటీఆర్

ABN , Publish Date - Jul 10 , 2024 | 02:21 PM

Andhrapradesh: ఏపీ మంత్రి సత్యకుమార్ సెటైర్లు, ఆయనను మాజీ మంత్రి కేటీఆర్ బ్లాక్ చేయడం.. రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. ఏపీ ఎన్నికల్లో జగన్ ఓటమి, ధర్మవరంలో కేతిరెడ్డి ఓడిపోవడంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి సెటైరికల్ కామెంట్స్ చేశారు.

Breakingnews: ఏపీ మంత్రి మాటల దాడి... బ్లాక్ చేసేసిన కేటీఆర్
KTR blocked the AP minister on Twitter

హైదరాబాద్, జూలై 10: ఏపీ మంత్రి సత్యకుమార్ AP Minister Satyakumar)సెటైర్లు, ఆయనను మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) బ్లాక్ చేయడం.. రెండు తెలుగు రాష్ట్ర (Telugu States) రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. ఏపీ ఎన్నికల్లో జగన్ (Former CM Jagan) ఓటమి, ధర్మవరంలో కేతిరెడ్డి ఓడిపోవడంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి సెటైరికల్ కామెంట్స్ చేశారు. దీంతో ఆయన ఎక్స్ అకౌంట్‌ను కేటీఆర్ బ్లాక్ చేసేశారు. ఏపీలో వైఎస్సార్పీపీ ఓడిపోవడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని.. అలాగే నిత్యం ప్రజల్లో ఉండే కేతిరెడ్డి ధర్మవరంలో ఎలా ఓటమి చెందారనేది అర్ధం కావడం లేదంటూ కేటీఆర్ అన్నారు. దీనిపై ఏపీ మంత్రి సత్యకుమార్ స్పందిస్తూ.. తనదైన శైలిలో కేటీఆర్‌పై మాటల దాడికి దిగారు. దీంతో ఏపీ మంత్రి వ్యాఖ్యలను తట్టుకోలేక మాజీ మంత్రి కేటీఆర్ ఏకంగా ఆయన ట్విట్టర్ అకౌంట్‌‌ను బ్లాక్ చేసేశారు.

Yanamala: గప్పాలు చెప్పుకున్న వారి తలరాతలు ప్రజలు తిరగరాశేసారు...


ఇంతకీ మంత్రి ఏమన్నారంటే...

‘‘ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఓటమి పై తెలంగాణా మాజీ మంత్రి కేటీఆర్ చిలక పలుకులు పలుకుతున్నారు.. ధరణి పేరుతో తెలంగాణలో మీరు నడిపిన భూమాఫియా లాగానే ధర్మవరంలో గుడ్ మార్నింగ్ పేరుతో మీ భూభకాసుర మిత్రుడు ప్రభుత్వ, అసైన్డ్, ప్రైవేటు, ప్రజలు ఆస్తులను ఆక్రమించాడు. చివరికి చెరువులు కొండలను కూడా కబళించాడు. గుడ్ మార్నింగ్ అంటే ప్రజలకు గుర్తుకు వచ్చేది కబ్జా-కలెక్షన్-కరప్షన్-కమీషన్లే. ఫాంహౌస్‌కు పరిమితమైన మీరు ఎక్స్‌లో అడిగినా ధర్మవరం ప్రజలు సమాధానం చెబుతారు. మీ అవినీతిని ప్రశ్నిస్తూ నిర్మాణాత్మక విమర్శ చేసినందుకు ట్విట్టర్‌లో నాలుగు సంవత్సరాల క్రితం నన్ను బ్లాక్ చేశారు. ఈ అవినీతి, అహంకారం, అసమర్థతే మిమ్మల్ని మీ ప్రియ మిత్రులు జగన్ కేతిరెడ్డిలను ఓడించాయి. ఒకే జాతి పక్షులు ఒకరికొకరు ‘సర్టిఫికేట్’ లు ఇచ్చుకుంటూ ఓదార్చుకోండి’’ అంటూ ఏపీ మంత్రి సత్యకుమార్ ట్వీట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

Chandrababu: ఆర్థిక శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష

Rahul Dravid: రూ.5 కోట్లు నాకొద్దు.. ద్రవిడ్ నిర్ణయంపై నెటిజన్ల ప్రశంసలు

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 10 , 2024 | 03:34 PM