Share News

Rahul Dravid: రూ.5 కోట్లు నాకొద్దు.. ద్రవిడ్ నిర్ణయంపై నెటిజన్ల ప్రశంసలు

ABN , Publish Date - Jul 10 , 2024 | 01:30 PM

భారత జట్టు మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) ఓ కీలక నిర్ణయంతో మరోసారి అనేక మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. అయితే టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన తర్వాత బీసీసీఐ(BCCI) సహాయక సిబ్బందికి రూ.125 కోట్ల ప్రైజ్‌మనీ ప్రకటించింది. అందులో రాహుల్ ద్రవిడ్‌కు రూ.5 కోట్లు ప్రకటించగా వద్దని అన్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Rahul Dravid: రూ.5 కోట్లు నాకొద్దు.. ద్రవిడ్ నిర్ణయంపై నెటిజన్ల ప్రశంసలు
Rahul Dravid

భారత జట్టు మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) ఓ కీలక నిర్ణయంతో మరోసారి అనేక మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. అయితే టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన తర్వాత బీసీసీఐ(BCCI) సహాయక సిబ్బందికి రూ.125 కోట్ల ప్రైజ్‌మనీ ప్రకటించింది. అందులో రాహుల్ ద్రవిడ్‌కు రూ.5 కోట్లు, కోచింగ్ సిబ్బందిలోని ఇతర సభ్యులకు రూ.2.5 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ క్రమంలో విషయం తెలిసిన ద్రవిడ్ మిగిలిన సహాయక సిబ్బంది మాదిరిగానే తనకు కూడా కేవలం రూ.2.5 కోట్లు ఇవ్వాలని ద్రవిడ్ బీసీసీఐని అభ్యర్థించారు. దీంతో ఆయన నిర్ణయాన్ని మేము గౌరవిస్తామని బీసీసీఐ తెలుపుతూ, మిగిలిన మొత్తాన్ని సహాయక సిబ్బందికి ఇవ్వాలని నిర్ణయించినట్లు బోర్డు తెలిపింది.


అప్పుడు కూడా

అంతేకాదు బోనస్ మొత్తాన్ని కోచ్‌లందరికీ సమానంగా పంచాలని రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) డిమాండ్ చేయడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు 2018లో భారత జట్టు అండర్ 19 ప్రపంచకప్ టైటిల్‌ను గెల్చినప్పుడు కూడా రాహుల్ ద్రవిడ్ ఇదే నిర్ణయాన్ని ప్రకటించారు. అప్పుడు రాహుల్ ప్రధాన కోచ్ పాత్రను పోషించగా ఆ సమయంలో కూడా ద్రవిడ్‌కు రూ.50 లక్షలు, సహాయక సిబ్బందికి రూ.20 లక్షలు బోనస్‌గా ఇవ్వాల్సి ఉండగా, అందరికీ సమానంగా ఇవ్వాలని కోరారు. దీంతో బీసీసీఐ తన నిర్ణయాన్ని మార్చుకుని ద్రవిడ్ సహా కోచ్‌లందరికీ రూ.25 లక్షల బోనస్ ఇచ్చింది.


ప్రశంసలు

ఇది తెలిసిన నెటిజన్లు(netizens) ద్రవిడ్ నిర్ణయాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. డబ్బు కోసం అనేక మంది పలురకాల పనులు చేస్తున్న ప్రస్తుత రోజుల్లో కూడా మీరు మనీని కాదనడం గ్రేట్ సర్ అని అంటున్నారు. అందరినీ సమానంగా చూడాలనుకున్న మీ నిర్ణయం సూపర్ అని ఇంకొంత మంది సోషల్ మీడియాలో మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. జూన్ 29న దక్షిణాఫ్రికాను ఓడించి భారత్ 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది.


ఇవి కూడా చదవండి..

Rahul Dravid: మెంటార్‌గా రాహుల్ ద్రావిడ్..!! ఏ టీమ్‌కంటే..?


Suryakumar Yadav: ఫైనల్ మ్యాచ్‌లో కాదు.. తన లైఫ్‌లో బెస్ట్ క్యాచ్ అదే అంటున్న సూర్యకుమార్ యాదవ్!


Team India Prize money: టీమిండియాకు రూ.125 కోట్ల ప్రైజ్‌మనీ.. ఎవరెవరికి ఎంతెంతంటే..!


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 10 , 2024 | 01:36 PM