Share News

Yanamala: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి సాయంపై యనమల స్పందన ఇదీ!

ABN , Publish Date - Jul 23 , 2024 | 12:50 PM

Andhrapradesh: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక సాయం ప్రకటించడం పట్ల మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ఏపీ ఏం ఆశించిందో వాటిని కేంద్రం బడ్జెట్టులో పోందుపర్చడం సంతోషంగా ఉందన్నారు. అమరావతికి రూ. 15 వేల కోట్లు ఇవ్వడంతో రాజధాని పనులను పరుగులు పెట్టించవచ్చన్నారు.

Yanamala: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి సాయంపై యనమల స్పందన ఇదీ!
Former Minister Yanamala Ramakrishnudu

అమరావతి, జూలై 23: కేంద్ర బడ్జెట్‌లో (Budget2024) ఏపీకి ప్రత్యేక సాయం ప్రకటించడం పట్ల మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు (Former Minister Yanamala Ramakrishnudu) హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ఏపీ ఏం ఆశించిందో వాటిని కేంద్రం బడ్జెట్టులో పోందుపర్చడం సంతోషంగా ఉందన్నారు. అమరావతికి రూ. 15 వేల కోట్లు ఇవ్వడంతో రాజధాని పనులను పరుగులు పెట్టించవచ్చన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేంద్రం మరోసారి స్పష్టంగా హామీ ఇవ్వడం శుభ పరిణామమన్నారు.

Madanapalle fire accident: పది ప్రత్యేక బృందాలుగా విడిపోయి విచారణ.. నిజాలు బయటపడతాయా?


ఆగిపోయిన వెనుకబడిన ప్రాంతాలకు నిధులిస్తామని చెప్పడం రాష్ట్ర ప్రగతికి తొడ్పడుతుందన్నారు. ఏపీలో ఏర్పడిన కొత్త ప్రభుత్వానికి కేంద్రం ప్రకటనలు ఆర్థిక తొడ్పాటు ఇస్తుందని తెలిపారు. ఆర్థికాభివృద్ధి జరుగుతుందన్నారు. ఏపీలో పారిశ్రామిక మౌళిక సదుపాయాల కల్పనకు ఆర్థిక సాయం ఇవ్వడం వల్ల పారిశ్రామికాభివృద్ధి సాధ్యపడుతుందన్నారు.

Union Budget 2024-25: ఉద్యోగాల కల్పన కోసం బడ్జెట్‌లో కీలక ప్రకటన



కేంద్ర బడ్జెట్ కేంద్ర, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు పుంజుకుంటాయన్నారు. స్వర్ణాంధ్ర సాధన దిశగా అడుగులు పడడానికి కేంద్ర బడ్జెట్ ఉపకరిస్తుందయని చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు ఫలించాయన్నారు. ఏపీపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రధాని మోదీకి, ఎన్డీఏ ప్రభుత్వానికి కృతఙతలు తెలియజేశారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కేంద్ర పథకాలు ఊతమిస్తాయని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

Stock Market: బడ్జెట్ వేళ భారీగా పడిపోయిన సూచీలు.. భారీగా నష్టపోయిన స్టాక్స్ అవే..!

Budget 2024: వ్యవసాయానికి రూ. 1.52 లక్షల కోట్లు..

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 23 , 2024 | 03:18 PM