Share News

Machilipatnam: ఇద్దరి మధ్య గొడవలు, కలిసి జీవించలేమని నిర్ణయం.. చివరికి ఏం చేశారంటే..

ABN , Publish Date - Nov 25 , 2024 | 11:18 AM

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో విషాదం చోటు చేసుకుంది. నిజాంపేటకు చెందిన భార్యాభర్తలు ఉప్పాల గోపీకృష్ణ, వాసవి 2011వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. కొన్నా్ళ్లపాటు బాగానే సాగిన వారి సంసారంలో గొడవలు ప్రారంభమయ్యాయి.

Machilipatnam: ఇద్దరి మధ్య గొడవలు, కలిసి జీవించలేమని నిర్ణయం.. చివరికి ఏం చేశారంటే..

కృష్ణా: ప్రస్తుత సమాజంలో భార్యాభర్తల బంధం నీటి బుడగలా మారిపోయింది. ప్రతి చిన్న విషయానికీ గొడవపడుతూ పవిత్ర బంధానికి అర్ధాంతరంగా ముగింపు పలుకుతున్నారు. చీటికీ, మాటికీ గొడవపడుతూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. మరికొంతమంది తమ బంధానికి ముగింపు పలికేందుకు కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. సంసారాన్ని హాయిగా సాగించాల్సింది పోయి మనస్పర్థలు పెంచుకుంటూ వివాదాలు కొని తెచ్చుకుంటున్నారు. ఘర్షణ పడుతూ క్షణికావేశంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ ప్రాణాలు తీసుకునే పరిస్థితులు దాపురించాయి. భాగస్వామి వేధింపులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడుతూ కుటుంబాన్ని రోడ్డుపాలు చేస్తున్నారు.


తాజాగా మచిలీపట్నంలో అటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. కుటుంబకలహాల నేపథ్యంలో దంపతులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. తరచూ గొడవలు పడుతూ జీవించే బదులు ఒక్కసారే ప్రాణాలు తీసుకుంద్దామనే దారుణ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు.


కృష్ణాజిల్లా మచిలీపట్నంలో విషాదం చోటు చేసుకుంది. నిజాంపేటకు చెందిన భార్యాభర్తలు ఉప్పాల గోపీకృష్ణ, వాసవి 2011వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. కొన్నా్ళ్లపాటు బాగానే సాగిన వారి సంసారంలో గొడవలు ప్రారంభమయ్యాయి. చిన్నచిన్న వివాదాలు వస్తున్నప్పటికీ వారు కలిసే ఉన్నారు. పలుమార్లు వివాదాలు ఘర్షణలకు దారి తీయడంతో ఇరు కుటుంబాల పెద్దలు వారిని మళ్లీ ఒకటి చేశారు. ఈ క్రమంలో వారికి ఇద్దరు పిల్లలు జన్మించారు. అయితే కొన్ని రోజులుగా వారి మధ్య ఏదో విషయంలో మళ్లీ వివాదం చెలరేగింది. ఇక తామిద్దరం కలిసి బతకలేయని నిర్ణయించుకున్నారు దంపతులు.


అయితే గోపీకృష్ణ, వాసవి దంపతులు విడాకుల వైపు మెుగ్గు చూపకుండా మరో దారుణ నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరూ కలిసి చనిపోవాలనే కఠిన నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇవాళ (సోమవారం) తెల్లవారుజామున మచిలీపట్నంలో రైలు కిందపడి ఆత్మహత్యకు యత్నించారు. అయితే ప్రమాదంలో వాసవి అక్కడికక్కడే మృతిచెందింది. గోపీకృష్ణకు తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు బాధితుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే కుటుంబకలహాలే బలవన్మరణానికి కారణమని గోపీకృష్ణ తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Viral Video: లగేజీ మధ్య నుంచి వచ్చిన దాన్ని చూసి పరుగులు పెట్టిన ప్రయాణికులు.. అసలు విషయం ఇదే..

Hyderabad: నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ విచారణ పునఃప్రారంభం..

Actor Vinayakan: గోవాలో దాదాగిరి చేసిన నటుడు.. చివరికి ఏం జరిగిందంటే..

Updated Date - Nov 25 , 2024 | 11:23 AM