Rain Alert: గండ్లు పూడుస్తున్న అధికారులు.. మళ్లీ రాత్రి నుంచి కురుస్తున్న వర్షం..
ABN , Publish Date - Sep 05 , 2024 | 07:35 AM
అమరావతి: విజయవాడను అతలాకుతలం చేసిన బుడమేరు వరద ముంపు మెల్లగా తొలగిపోతోంది. అధికారులు యుద్ధ ప్రాతిపదికన బుడమేరు గండ్లు పూడుస్తున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు రాత్రి తెల్లవారులు దగ్గర ఉండి పనులు చేస్తున్నారు. మళ్లీ బుడమేరకు వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో శరవేగంగా గండ్ల పూడుస్తున్నారు.
అమరావతి: విజయవాడను అతలాకుతలం చేసిన బుడమేరు (Budameru) వరద ముంపు మెల్లగా తొలగిపోతోంది. అధికారులు యుద్ధ ప్రాతిపదికన బుడమేరు గండ్లు పూడుస్తున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) రాత్రి తెల్లవారులు దగ్గర ఉండి పనులు చేయిస్తున్నారు. మళ్లీ బుడమేరకు వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో శరవేగంగా గండ్ల పూడుస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu Naidu), మంత్రి లోకేష్‌లు (Minister Lokesh) ఎప్పటికప్పుడు బుడమేరు గండ్లు పూడిక పనులను సమీక్షిస్తున్నారు.
బుడమేరు వరద ముంపు మెల్లగా తొలగిపోతోంది. విజయవాడ నగరం కోలుకుంటోంది. బుడమేరు ముంచెత్తడంతో 5 నుంచి 8 అడుగుల వరద నీటిలో మునిగిన అజిత్ సింగ్‌నగర్, పాయకాపురం తదితర ప్రాంతాల్లో దాదాపు 80 శాతం ముంపు నుంచి బయటపడ్డాయి. వరద నీరు తగ్గిన ప్రాంతాల్లో అధికారులు ఎక్కడికక్కడ విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. యుద్ధ ప్రాతిపదికన పారిశుధ్య పనులు చేస్తున్నారు. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 3454 మంది కార్మికులతోపాటు 450 మంది ప్రజారోగ్య సిబ్బందిని ఈ పనులకు వినియోగిస్తున్నారు. వీరితోపాటు ఇతర మున్సిపాలిటీల నుంచి వచ్చిన 5889 మంది కార్మికులను రంగంలోకి దించారు. కాగా, ఇళ్లలో బురద మేట వేయడంతో దాన్ని శుభ్రం చేసుకునేందుకు తీవ్ర ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన అధికారులు ఏకంగా ఫైర్ ఇంజన్లను రంగంలోకి దించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 48 ఫైర్ ఇంజన్లను తెప్పించారు.వాటిద్వారా వీధుల్లో, ఇళ్లలోకి చేరిన బురద, మురుగు కొట్టేస్తున్నారు.
కాగా విజయవాడతో పాటు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎంత వర్షం కురుస్తున్నప్పటికీ వరద బాతులకు సహాయ కార్యక్రమాల్లో ఇటువంటి ఆటంకాలు ఉండకూడదని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రంలోగా బుడమేరు గండ్లను పూడ్చాలని చంద్రబాబు అన్నారు. గండ్లు పూడ్చే పనిని మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
ఎంత కష్టం... ఎంత నష్టం
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని వాంబే కాలనీ, కండ్రిక, రాజీవ్ నగర్ కాలనీ, ఉడా కాలనీ, ఆంధ్రప్రభ కాలనీలలోని చివరి ప్రాంతాలు నాలుగైదు అడుగుల ముంపులో ఉన్నాయి. పశ్చిమ నియోజకవర్గంలో.. విద్యాధరపురం కబేళా సెంటర్, ఆర్టీసీ వర్క్ షాపు రోడ్డు ముంపులో ఉన్నాయి. మిగిలిన ప్రాంతాలన్నీ దాదాపు ముంపు నుంచి తేరుకున్నాయి. వరద ముంపు నుంచి బయటపడిన జనం ఇళ్లకు తాళాలు వేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. సుమారు 60 వేల ఇళ్లు పూర్తిగా వరద ముంపునకు గురయ్యాయని, రూ.600 కోట్ల నష్టం సంభవించి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇది కేవలం నివాస గృహాల్లో జరిగిన ఆస్తి నష్టం మాత్రమే. ఒక్కో కుటుంబం కనీసం రూ.లక్ష విలువైన ఆస్తిని నష్టపోయి ఉంటుందని అంచనా.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ చేష్టలతోనే ఇంతటి విపత్తు
మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News