AP Politics: పేర్ని నాని ఆందోళన తగ్గేందుకు ఈ పనిచేయ్.. మాజీ మంత్రి కొత్తపల్లి హాట్ కామెంట్స్
ABN , Publish Date - Feb 29 , 2024 | 06:20 PM
జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan)ను విమర్శించిన పేర్ని నానికి మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు (Kothapalli Subbarayudu) కౌంటర్ ఇచ్చారు. టీడీపీ- జనసేన ఉమ్మడిగా సభ నిర్వహిస్తే పేర్ని నాని ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని అడిగారు. తాడేపల్లిగూడెం సభకు వచ్చిన జనాలను చూసి నానికి భయం పట్టుకుందని అన్నారు.
ఏలూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan)ను విమర్శించిన పేర్ని నానికి మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు (Kothapalli Subbarayudu) కౌంటర్ ఇచ్చారు. టీడీపీ- జనసేన ఉమ్మడిగా సభ నిర్వహిస్తే పేర్ని నాని ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని అడిగారు. తాడేపల్లిగూడెం సభకు వచ్చిన జనాలను చూసి నానికి భయం పట్టుకుందని అన్నారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... పేర్ని నాని( Perni Nani) ఆందోళన తగ్గడానికి తాడు కట్టించుకొంటే మంచిదని ఆక్షేపించారు.
వైసీపీలో అభ్యర్థులను నిలబెట్టలేనివారికి పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించే హక్కు ఎక్కడిది.? అని ప్రశ్నించారు. గతంలో కమ్యూనిస్టులు, బీఆర్ఎస్ జెండాలు మోసిన చరిత్ర వారిదని చెప్పారు. పవన్ రాష్ట్ర అభివృద్ధి కోసం స్వార్థం లేని రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. వైసీపీలో ఉన్న స్వార్థం జనసేనలో లేదని చెప్పారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలల్లో అభ్యర్థులను పెట్టే సత్తా వైసీపీకి ఉందా? అని కొత్తపల్లి సుబ్బారాయుడు నిలదీశారు.
Perninani: పవన్ నువ్వు నికార్సైన వాడివైతే...
AP NEWS: జగన్ ప్రభుత్వం మరోసారి ఆ సంస్థకు భారీ ఆఫర్
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి