Share News

Anagani: జగన్‌ను ఆ పార్టీ నేతలే భరించలేకపోతున్నారు..

ABN , Publish Date - Aug 08 , 2024 | 04:41 PM

Andhrapradesh: జగన్‌ను ప్రజలు మాత్రమే కాదు.. ఆయన పార్టీ నేతలూ భరించలేకపోతున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తోందన్నారు. ఇచ్చిన హామీల్లో కేవలం 13 శాతం మాత్రమే..

Anagani: జగన్‌ను ఆ పార్టీ నేతలే భరించలేకపోతున్నారు..
Minister Anagani Satyaprasad

అమరావతి, ఆగస్టు 8: జగన్‌ను ప్రజలు మాత్రమే కాదు..ఆయన పార్టీ నేతలూ భరించలేకపోతున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తోందన్నారు. ఇచ్చిన హామీల్లో కేవలం 13 శాతం మాత్రమే అమలు చేసి ప్రజలకు పంగనామాలు పెట్టిన జగన్‌కు హామీల అమలులో చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు లేదన్నారు.

Somireddy: జన్మభూమిని తిరిగి ప్రారంభించే దిశగా అడుగులు..


జగన్‌ను రాష్ట్ర ప్రజలు మాత్రమే కాదు.. ఆయన పార్టీ నేతలు కూడా వద్దనుకుంటున్నారన్నారు. పొలోమని పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు రాజీనామాలు చేసి ఇతర పార్టీల్లో చేరుతున్నారని తెలిపారు. ఈ కారణంగానే విశాఖ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్లోనే కాదు.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ వైసీపీకి ఓటమి ఖాయమని స్పష్టం చేశారు. వరుసగా అన్ని ఎన్నికల్లో ఓడిపోతున్నా జగన్‌కు తత్వం బోధపడడం లేదని, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవడం లేదన్నారు. జగన్ రెడ్డి తాను మళ్లీ సీఎం కుర్చీపైన కూర్చుంటానంటూ పగటి కలలు కంటున్నారన్నారు.

CM Chandrababu: ముగిసిన టీడీపీ పొలిట్‌ బ్యూరో సమావేశం.. పలు కీలక విషయాలపై చర్చ..!!


జగన్ మానసిక స్థితి బాగోలేదని ఆయన చెల్లెలు చెప్పింది నిజమే అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలలకే అన్ని వ్యవస్థలూ విఫలమయ్యాయని జగన్ పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని మండిపడ్డారు. వైసీపీ పాలన చేసిన గాయాల నుంచి ప్రజల ఇంకా కోలుకోలేదన్నారు. 11 సీట్ల మాత్రమే ఇచ్చి ఆ పార్టీని అధ:పాతాళానికి తొక్కిన ప్రజలు... నిజంగా జగన్ ప్రజలకు బిర్యానీనే పెట్టి ఉంటే ఎన్నికల్లో ప్రజలెందుకు దారుణంగా ఓడించారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రశ్నించారు.


ఇవి కూడా చదవండి..

Ambati Rambabu: ఏపీలో లా అండ్ ఆర్డర్‌‌ దారుణంగా పడిపోయింది..

Akhilesh Yadav: లోక్‌సభ స్పీకర్ అధికారాలపై అఖిలేష్ యాదవ్ సంచలన ఆరోపణ.. కౌంటర్ ఇచ్చిన అమిత్ షా

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 08 , 2024 | 04:41 PM