Share News

Superfood Rosehip : ఈ గులాబీ పండ్ల ఎప్పుడైనా తిన్నారా..!

ABN , Publish Date - Aug 08 , 2024 | 04:07 PM

రోజ్ షిప్‌లు, గులాబీ మొక్కలకు పూసే చిన్న కాయలు, వీటిలో అనేక శక్తివంతమైన పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు, కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉన్నాయి.

Superfood Rosehip : ఈ గులాబీ పండ్ల ఎప్పుడైనా తిన్నారా..!
Health Benefits

అందంగా, ముద్దుగా ఆకర్షణీయంగా ఉండే గులాబీ పూలంటే ఇష్టపడనివారంటూ ఉండరు. ప్రేమకు చిహ్నంగా చూసే గులాబీలతో రోజ్ మిల్క్, రోజ్ వాటర్ చాలా ఉత్పత్తుల్ని తయారుచేస్తారు. గులాబీ పూలే కాదు గులాబీ పండ్లతో కూడా చక్కని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. గులాబీ చెట్టు పండ్లను హిప్ బెర్రీస్ అంటారు. ఈ గులాబీ పండ్లతో టీ తయారు చేస్తారు. జామ్‌లు, జెల్లీల్లో కలపవచ్చు. ఇలా ప్రాసెస్ చేయడం కంటే గులాబీ పండ్లను తాజాగా తీసుకున్నా కూడా బోలెడు ప్రయోజనాలట. రోజ్ షిప్‌లు, గులాబీ మొక్కలకు పూసే చిన్న కాయలు, వీటిలో అనేక శక్తివంతమైన పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు, కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇంకా వీటితో ఎలాంటి ప్రయోజనాలందుతాయంటే..

రోసా కానినా అనేది ఐరోపా, ఆఫ్రికా, ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే అడవి గులాబీ జాతి. దీనికి పూసే పండ్లు చాలా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. రోజ్ షిప్ ఎక్స్ ట్రాక్ట్‌లో పాలీఫెనాల్స్, ఆంథోసైనిస్‌లు ఉంటాయి. ఇవి జాయింట్ ఇన్ఫ్లమేషన్ తగ్గించి, కీళ్ల నష్టాన్ని నివారిస్తాయి. ఈ పండ్లు యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇందులో ముఖ్యంగా విటమిన్ సి గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పండ్లతో సిరప్స్, పౌడర్ తయారు చేస్తారు. టీ రూపంలో కూడా దీనిని తాగవచ్చు.

రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది.

రోజ్‌షిప్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్లు సి,ఎ, ఇ అధికంగా ఉన్నాయి. ఇవి తెల్ల రక్తకణాల ఉత్పత్తిని పెంచుతాయి. రోగనిరోధక పనితీరును పెంచి, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పనిచేస్తుంది.

Festival Time : హరియాలీ తీజ్ వేడుకల్లో ఖీర్ ఎందుకు చేస్తారు?


మంటను తగ్గిస్తుంది. .

కాళ్ళల్లో మంట, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది.

చర్మ పోషణ..

చర్మ పోషణ, అకాల వృద్ధాప్యాన్ని ఆపడంలోనూ ఈ పండ్లు సహకరిస్తాయి.

Health Tips : ఖాళీ కడుపుతో ఉదయాన్నే నీరు తాగడం ఆరోగ్యమేనా..!


ఈ గులాబీ పండ్లతో కలిగే దుష్ప్రభావాలు..

ఈ దుష్ర్పభావాలు సాధారణంగా తేలికైనవి.

అలెర్జీలు

మలబద్ధకం

అతిసారం

గుండెల్లో మంట ఉంటాయి. కనుక వైద్యుల సలహా మేరకూ మాత్రమే ఈ పండ్ల ఉత్పత్తులను వాడాలి.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Aug 08 , 2024 | 04:07 PM