Share News

Bhatti Vikramarka: రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం

ABN , Publish Date - Aug 20 , 2024 | 01:00 PM

Telangana: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 80వ జయంతి వేడుకలు గాంధీభవన్‌లో ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాజీవ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ... రాజీవ్ గాంధీ మిస్టర్ క్లీన్ ప్రధానిగా పేరు తెచ్చుకున్నారని తెలిపారు.

Bhatti Vikramarka: రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం
Deputy CM Bhatti Vikramarka

హైదరాబాద్, ఆగస్టు 20: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 80వ జయంతి వేడుకలు గాంధీభవన్‌లో ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) రాజీవ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ... రాజీవ్ గాంధీ మిస్టర్ క్లీన్ ప్రధానిగా పేరు తెచ్చుకున్నారని తెలిపారు. సద్భావన యాత్ర మొదలు పెట్టింది రాజీవ్ గాంధీ అని తెలిపారు. పారిశ్రామిక విప్లవాన్ని తీసుకొచ్చి కంప్యూటర్‌ను పరిచయం చేశారన్నారు. హైదరాబాద్‌లో కప్యూటర్ రంగంలో ముందుకు పోవడానికి కారణం ఆ నాటి ముఖ్యమంత్రులు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి , రాజశేఖర్ రెడ్డి అని చెప్పుకొచ్చారు.

Kolkata Doctor Case: కోల్‌కత్తా డాక్టర్‌పై హత్యాచారం కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు


18 ఏండ్లకే యువత పాలనలో భాగస్వామ్యం కావాలని 18 ఏండ్లకే యువకులకు ఓటు హక్కును కల్పించారని తెలిపారు. కొంత మంది కుట్రదారులు కుట్ర చేసి రాజీవ్ గాంధీని చంపారని మండిపడ్డారు. ఆయన ఆశయసాధన కోసం అందరూ ముందుకు పోతున్నారని.. అందుకే ప్రతి ఏటా ఆయన జయంతిని ఘనంగా నిరవహిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ దీపాదాస్ మున్సీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎంపీ బలరాం నాయక్, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, స్పోర్ట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి,మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు పాల్గొన్నారు.


రాజీవ్ విగ్రహానికి రేవంత్ నివాళులు...

మరోవైపు.. సోమాజిగూడలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. పీసీసీ మాజీ చీఫ్ వీహెచ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ...‘‘ఎవడికైనా చేతనైతే రాజీవ్ గాంధీ విగ్రహం ముట్టుకోండి. రాజీవ్ విగ్రహాన్ని ముడితే చెప్పు తెగే దాకా కొడుతాం. రాజీవ్ విగ్రహం ఎవరు ముడుతారో, ఎప్పుడు ముడుతారో చెపితే మా జాగ్గారెడ్డిని పంపిస్తాం. తాగుబోతులు, దొంగల విగ్రహాలకు సచివాలయం ముందు స్థానం లేదు. తొందరలోనే రాజీవ్ విగ్రహాన్ని ఆవిష్కరించుకుందాం. పండగ వాతావరణంలో రాజీవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుందాం. రాజీవ్ విగ్రహాన్ని పెడతామంటే తొలగిస్తామని కొందరు సన్నాసులు అంటున్నారు. అధికారం పోయినా బలుపు తగ్గలేదు. బలుపును తగ్గించే బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకుంటారు. వాళ్ల అయ్య విగ్రహం పెట్టుకోవాలని కేటీఆర్ అనుకుంటున్నాడు. వాళ్ల అయ్య పోయేదెప్పుడు? విగ్రహాన్ని పెట్టేదెప్పుడు. ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొన్నారు. తాగుబోతు సన్నాసి విగ్రహం సెక్రటేరియట్ ముందు పెడుతారా?. తెలంగాణను దోచుకున్న దొంగ విగ్రహం పెట్టాలా’’ అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.


దేశ యువతకి రాజీవ్ గాంధీ స్ఫూర్తి అని... విప్లవాత్మకమైన చైతన్యానికి కారణం రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఇండియా ప్రపంచంతో పోటీ పడుతుందని గుర్తించింది రాజీవ్ గాంధీ అని అన్నారు. టెక్నాలజీ మాత్రమే కాకుండా సామాజిక చైతన్యం ఉన్న వ్యక్తి రాజీవ్ గాంధీ అని వెల్లడించారు. మహిళలకు ప్రాధాన్యం ఉండాలని మహిళా సాధికారతకు అడుగులు వేసినవారు రాజీవ్ గాంధీ అని చెప్పుకొచ్చారు. దేశ సమగ్రత కోసం రాజీవ్ ప్రాణత్యాగం చేశారన్నారు. ‘‘1921 నుంచి 1931 వరకు గాంధీ నడిపిన పత్రిక పేరు యంగ్ ఇండియా. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ త్వరలోనే నెలకొల్పుతాం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

Rain Alert: ప్రమాదకర స్థితిలో ముసారంబాగ్ బ్రిడ్జి

TG Politics: సిద్దిపేట జిల్లా కేంద్రంలో పొలిటికల్ హీట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 20 , 2024 | 01:02 PM