Share News

Rain Alert: ప్రమాదకర స్థితిలో ముసారంబాగ్ బ్రిడ్జి

ABN , Publish Date - Aug 20 , 2024 | 11:02 AM

Telangana: భాగ్యనగరాన్ని వర్షాలు దంచికొడుతున్నాయి. గంట పాటు కురుస్తున్న వర్షానికైనా నగరవాసులు అల్లాడిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ప్రతీరోజు ఏ సమయంలో వర్షం పడుతుందో తెలియని స్థితి నెలకొంది.

Rain Alert: ప్రమాదకర స్థితిలో ముసారంబాగ్ బ్రిడ్జి
Musarambagh Bridge

హైదరాబాద్, ఆగస్టు 20: భాగ్యనగరాన్ని (Hyderabad) వర్షాలు దంచికొడుతున్నాయి. గంట పాటు కురుస్తున్న వర్షానికైనా నగరవాసులు అల్లాడిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ప్రతీరోజు ఏ సమయంలో వర్షం పడుతుందో తెలియని స్థితి నెలకొంది. మరోవైపు భారీ వర్షాల కారణంగా నగరంలోని మూసారంబాగ్ బ్రిడ్జి (Musarambagh Bridge) ప్రమాదకరంగా మారింది. ఎగువ ప్రాంతాల నుంచి మూసికి వరద పోటెత్తోంది. మూసారాంబాగ్ వద్ద ఉధృతంగా వరద ప్రవహిస్తోంది. దీంతో మూసి పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

Kamala Harris: కమలా హ్యారీస్ సర్‌ప్రైజ్ ప్రసంగం.. అధ్యక్షుడు జో బైడెన్‌పై ప్రశంసల జల్లు



అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్టుల్లోకి వరద పోటెత్తుతోంది. కామారెడ్డి జిల్లాలో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. 1520 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405.00 అడుగులు కాగా... ప్రస్తుతం 1390.72 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలకు గాను.. ప్రస్తుతం 4.347 టీఎంసీలుగా కొనసాగుతోంది.


నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్‌లోకి వరద కొనసాగుతోంది. 11,926 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదు అయ్యింది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులకు గాను..ప్రస్తుతం 1081.80 అడుగులకు చేరింది. అలాగే పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 50.07 టీఎంసీలకు నమోదు అయ్యింది.

Heavy Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. జలమండలి కీలక ఆదేశాలు


మంచిర్యాల జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇన్ ఫ్లో 10 వేల క్యూ సెక్కులుగా ఉంది. అవుట్ ఫ్లో 3600 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. ప్రస్తుత నీటి నిల్వ 14.8508 టీఎంసీలు, పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలుగా కొనసాగుతోంది. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 2500 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. అవుట్ ఫ్లో 800 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటి నిల్వ 698.100 అడుగులకు చేరింది. పూర్తి నీటి సామర్థ్యం 700 అడుగులకు చేరింది.


ఇవి కూడా చదవండి..

Hyderabad: హైడ్రాను ఆపేదెలా?.. ఉన్నతస్థాయి చర్చలు!

Rains: వర్షాలపై విద్యాశాఖ అలర్ట్.. పాఠశాలలకు సెలవు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 20 , 2024 | 11:46 AM