Minister Manohar: రేషన్ సరకుల్లో లోపంపై అధికారులను నిలదీసిన మంత్రి మనోహర్..
ABN , Publish Date - Jun 19 , 2024 | 07:39 PM
గొల్లపూడి(Gollapudi) మండల్ లెవల్ స్టాక్(MLS)పాయింట్‌ను పౌరసరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) ఆకస్మిక తనిఖీ చేశారు. రేషన్ సరకుల్లో(Ration Goods) నాణ్యతా లోపం, పరిమాణం తగ్గిన ప్యాకింగ్‌పై ఆయన మండిపడ్డారు.
విజయవాడ: గొల్లపూడి(Gollapudi) మండల్ లెవల్ స్టాక్(MLS)పాయింట్‌ను పౌరసరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) ఆకస్మిక తనిఖీ చేశారు. రేషన్ సరకుల్లో(Ration Goods) నాణ్యతా లోపం, పరిమాణం తగ్గిన ప్యాకింగ్‌పై ఆయన మండిపడ్డారు. ప్రజలకు ఇలాంటి ఆహార పదార్థాలు పంపిణీ చేస్తారా అంటూ తీవ్రంగా మండిపడ్డారు. మెుదట గోడౌన్‌లో సరకులు, వాటి రికార్డుల జాబితాలను మంత్రి మనోహర్ పరిశీలించారు.
నాణ్యత లేని సరకులు, తగ్గిన పరిమాణం..
పంచదార, నూనె అరకిలో ప్యాకెట్లను తూకం పెట్టించగా.. ప్రతి ప్యాకెట్‌లో 20నుంచి 50 గ్రాముల వరకు తక్కువుగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కిలో కంది పప్పు ప్యాకెట్ కూడా 50గ్రాములు తక్కువుగా ఉన్నట్లు గుర్తించిన మంత్రి అధికారులను ప్రశ్నించారు. ప్రజలకు పంపిణీ చేసే సరకుల నాణ్యత లోపంపై మంత్రి మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తినేందుకు ఇచ్చే ఆహార పదార్థాలు ఇంత ఘోరంగా ఉన్నాయా అంటూ అధికారులను ప్రశ్నించారు. వీటిని వెనక్కి పంపించకుండా ఎలా పంపిణీ చేస్తున్నారంటూ మంత్రి మనోహర్ మండిపడ్డారు.
MLA Shravan Kumar: ఎమ్మెల్యే పేరుతో మోసాలకు పాల్పడుతున్న సైబర్ కేటుగాళ్లు..
సరకు మొత్తాన్ని వెంటనే వెనక్కి పంపించాలని ఆదేశించారు. నాణ్యమైన సరకు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. ప్యాకింగ్ చేసే కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు, పిల్లలకు పంపిణీ చేసే వాటిలో కూడా కోత పెట్టడంపై అధికారులను అక్కడే నిలదీశారు. దీనిపై వెంటనే విచారణ చేసి నివేదిక ఇవ్వాలని మంత్రి నాదెండ్ల అధికారులను ఆదేశించారు.
ఇవి కూడా చదవండి:
Pawan Kalyan: ఐఏఎస్ అధికారులతో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తొలి సమీక్ష..
Minister Dola: రుషికొండ భవనాలు కచ్చితంగా వినియోగిస్తాం: మంత్రి వీరాంజనేయస్వామి