Share News

Nadendla: ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన

ABN , Publish Date - Oct 25 , 2024 | 12:47 PM

Andhrapradesh: మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. గ్యాస్ సిలిండర్లను ఎప్పటి నుంచి పొందవచ్చు అనే విషయాన్ని వెల్లడించారు. ఏ విధంగా ఉచిత గ్యాస్ కనెక్షన్‌‌‌కు పొందవచ్చు అనే విషయాన్ని కూడా మంత్రి నాదెండ్ల తెలిపారు.

Nadendla: ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన
Minister Nadendla Manohar

అమరావతి, అక్టోబర్ 25: సూపర్ సిక్స్ పథకాల్లో ముఖ్యమైన ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ పథకంపై మంత్రి నాదెండ్ల మనోహర్ (Minister Nadendla Manohar) కీలక ప్రకటన చేశారు. ఆర్ధిక భారం లేకుండా వీలైనంత త్వరగా ఈ పథకాన్ని అమలు చేయాలని చూస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రజలు ఎన్నో ఆశలు, ఆకాంక్షలను కోరుకుంటున్నారని... దీనికి అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు , ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనలు మేరకు ప్రజలకు సంక్షేమం, అభివృద్ధిని అందజేస్తున్నామని తెలిపారు.

Telangana: పక్కా ఆధారాలు.. కీలక నేతల అరెస్ట్‌కు ముహూర్తం ఫిక్స్: మంత్రి పొంగులేటి


మహిళలకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ల పథకంపై ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్‌లో ఆమోదం లభించిందన్నారు. శాఖల వారీగా చర్చించి ఆయిల్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నామన్నారు. రాష్ట్రంలో ఉన్న సుమారు కోటి 55 లక్షల గ్యాస్ కనెక్షన్‌లకు ఏ విధంగా అందుబాటులోకి తేగలుగుతాం అనే దానిపై అధ్యయనం చేశామన్నారు. ఆర్ధిక భారం లేకుండా వీలున్నంత త్వరగా పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు. నేడు ఈ పథకానికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయనున్నట్లు వెల్లడించారు. అక్టోబర్ 31 డెలివరీ రోజుగా పెట్టుకొని మొదటి సిలిండర్ మార్చి 31 వరకూ ఎప్పుడైనా పొందవచ్చన్నారు. ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందేందుకు అర్హత కలిగిన ఎల్పీజీ కనెక్షన్ ఉండాలని, తెల్ల రేషన్ కార్డు ఉండాలని అలాగే ఆధార్ కార్డు ఉండాలని తెలిపారు.


సీఎం చేతుల మీదుగా...

29వ తేదీన ఉదయం 10 గంటల నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయన్నారు. ఈనెల 30న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఇప్పిస్తామని.. బుకింగ్ కన్ఫం అవ్వగానే ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం ఒకటి బుక్ అయ్యిందని ఎస్‌ఎమ్‌ఎస్ వెళుతందన్నారు. మూడు ఆయిల్ కంపెనీలతో జరిగిన చర్చను బట్టి 24 నుంచి 48 గంటల్లోపు డెలివరీలు పూర్తవుతాయన్నారు. గ్యాస్ సిలిండర్ అందించిన క్షణం నుంచి 48 గంటల్లోపు వారి ఖాతాల్లోకి అమౌంట్ జమ అవుతుందన్నారు. రూ.894.92 కోట్లు ఆయిల్ కంపెనీలకు 29న అందిస్తామన్నారు. కేంద్రం ఎలా డీబీటీ ద్వారా ఇస్తుందో అలాగే తాము కూడా డీబీటీ ద్వారా పంపిణీ చేయాలని కోరారన్నారు. వచ్చే సిలిండర్ నాటికి నేరుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచే ఈ నిధులు అందిస్తామని వెల్లడించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.2674 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పథకం ద్వారా ఖర్చు అవుతుందని తెలిపారు. ఎవ్వరికైనా పథకం అందకపోతే 1967 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

Telangana: కేటీఆర్ పరువు నష్టం కేసులో మంత్రి సురేఖకు షాక్..


ఈ తేదీల్లో ఉచిత గ్యాస్‌ను పొందొచ్చు..

  • అక్టోబర్ 31 నుంచి మార్చి 31 లోపు గ్యాస్ సిలిండర్ పొందవచ్చు

  • రెండవ విడుత సిలిండర్ కోసం ఏప్రిల్ 1 నుంచి జులై 30 వరకూ

  • మూడవ విడుత సిలిండర్ ఆగస్టు 1 నుంచి నవంబర్ 31 వరకూ

  • నాల్గవ విడుత సిలిండర్ డిసెంబర్ 1 నుంచి మార్చి 31 వరకూ పొందవచ్చు


ఇవి కూడా చదవండి..

Narayana: దాచేపల్లిలో డయేరియా పరిస్థితిపై మంత్రి నారాయణ సమీక్ష

Tirumala: శారదా పీఠం అక్రమ నిర్మాణాల కూల్చివేతకు రంగం సిద్ధం

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 25 , 2024 | 01:04 PM