Share News

Minister Narayana: శానిటేషన్‌పై మంత్రి నారాయణ కీలక ఆదేశాలు

ABN , Publish Date - Sep 12 , 2024 | 03:30 PM

వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన శానిటేషన్‌ పనులపై సంబంధిత అధికారులకు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, కొలికపూడి శ్రీనివాసరావుతో కలిసి మంత్రి నారాయణ ఈరోజు(గురువారం) వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.

Minister Narayana: శానిటేషన్‌పై మంత్రి నారాయణ కీలక ఆదేశాలు

విజయవాడ: వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన శానిటేషన్‌ పనులపై సంబంధిత అధికారులకు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, కొలికపూడి శ్రీనివాసరావుతో కలిసి మంత్రి నారాయణ ఈరోజు(గురువారం) వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. పాయకాపురం, ఉడా కాలనీ, జర్నలిస్టు కాలనీ, కండ్రిక, ఆంబాపురంలో బాధితులను పరామర్శించి వారికి అందుతున్న సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.


ALSO READ: Balakrishna: సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు చెక్కులు ఇచ్చేందుకు విజయవాడకు సినీ బృందం

పలు ప్రాంతాల్లో స్వల్పంగా ఉన్న వరద నీటిని బయటకు పంపింగ్ చేయడంపై అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడారు. పాయకాపురం నుంచి ముస్తాబాద్ వరకూ బుడమేరు ప్రవహించే మార్గాన్ని పరిశీలించారు. ఇళ్ల మధ్య ఖాళీ స్థలాల్లో నిల్వ ఉన్న నీటిని త్వరితగతిన బుడమేరులోకి తరలించేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు. విజయవాడలో మొత్తం 32 డివిజన్లలో నీరు దాదాపు తగ్గిపోయిందని తెలిపారు.


ALSO READ: Padi Koushik Reddy: కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికపూడి.. హీటెక్కిన గ్రేటర్.. బ్రోకర్ అంటూ..

ఒకటి రెండు డివిజన్లలో వరద నీరు కొద్దిగా నిల్వ ఉందని చెప్పారు. నీటిని బయటకు పంపింగ్ చేసేందుకు అవసరమైన చోటా రోడ్లకు గండ్లు కొడుతున్నామని అన్నారు. రేపు(శుక్రవారం) సాయంత్రానికి మొత్తం నీరు బయటకు పంపింగ్ చేస్తామని వెల్లడించారు. అన్ని డివిజన్లలో శానిటేషన్ ప్రక్రియ దాదాపు పూర్తి కావస్తుందని అన్నారు. వరద ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి వస్తుందని మంత్రి నారాయణ పేర్కొన్నారు.


జగన్‌కు ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మాస్ వార్నింగ్

అమరావతి: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మాస్ వార్నింగ్ ఇచ్చారు, ‘ఖబడ్దార్ జగన్మోహన్ రెడ్డీ నోటి కొచ్చినట్లుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోం. జగన్ రెడ్డికి 11 సీట్లు ఎందుకిచ్చామా అని ప్రజలు బాధపడుతున్నారు. 31 క్రిమినల్ కేసులున్నా నువ్వా సీఎం చంద్రబాబు గురించి మాట్లాడేది..? వరద బాధితుల పరామర్శకు మనసురాని జగన్ రెడ్డి జైళ్లకు, శవాల దగ్గరకు పరుగులు పెడతాడ’’ అని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఆరోపణలు చేశారు.


ఢిల్లీ వెళ్లి విష ప్రచారం చేసిన జగన్ రెడ్డి

‘‘టీడీపీ ఆఫీస్‌ను విధ్వంసం చేసిన కేసులో అరెస్టైన నందిగం సురేష్ , ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్టైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జగన్ రెడ్డి పరామర్శించడం దేనికి సంకేతం? జగన్ రెడ్డి త్వరలో మైనర్ బాలిక లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన కోడుమూరు మాజీ వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్‌ను పరామర్శించబోతున్నాడు. అమరావతిలో సీసీ రోడ్లను తవ్వేసి, కంకర అమ్ముకుని, అరటిచెట్లు నరికేసి విధ్వంసం చేసిన దుర్మార్గుడు నందిగం సురేష్. సామాన్య ఫొటో గ్రాఫర్ నుంచి నందిగం సురేష్ వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లలో వందల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డాడు. ఎంపీగా ప్రజలకు ఏం చేశాడని నందిగం సురేష్‌పై బయోపిక్ తీస్తున్నారో అర్ధం కావడంలేదు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 36 మంది వైసీపీ కార్యకర్తలు చనిపోయారని ఢిల్లీ వెళ్లి మరీ విష ప్రచారం చేసిన జగన్ రెడ్డి ఆ లిస్ట్ ఇమ్మంటే ఎందుకు నోరెత్తడంలేదు? జగన్ రెడ్డికి శవ రాజకీయాలు అలవాటుగా మారాయి’’ అని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తీవ్ర విమర్శలు గుప్పించారు.


ఈ వార్తలు కూడా చదవండి...
YS Sharmila: ఏలేరు ఆధునికీకరణను జరగకపోవడం వల్లే ఇంతటి విపత్తు

Nimmala: బోట్లు తొలగింపులో అనుభవం ఉన్న అబ్బులును తీసుకొస్తున్నాం

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 12 , 2024 | 03:34 PM