Share News

Ramanaidu: సాగునీటికి చంద్రబాబు ప్రభుత్వం ప్రాధాన్యత

ABN , Publish Date - Jul 10 , 2024 | 11:59 AM

Andhrapradesh: నీరు లేకపోతే ప్రాణం నిలవదని ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. త్రాగునీటిని నిర్లక్ష్యం చేసింది మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. కొత్త ఆయకట్టుకు కూడా సాగు నీరు ఇచ్చి రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

Ramanaidu: సాగునీటికి చంద్రబాబు ప్రభుత్వం ప్రాధాన్యత
Minister Nimmala Ramanaidu

విజయవాడ, జూలై 10: నీరు లేకపోతే ప్రాణం నిలవదని ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. త్రాగునీటిని నిర్లక్ష్యం చేసింది మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. కొత్త ఆయకట్టుకు కూడా సాగు నీరు ఇచ్చి రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జగన్ (Former CM Jagan) పాలనతో ఇరిగేషన్‌ను 20 ఏళ్ళ వెనక్కు నెట్టేసారని వ్యాఖ్యలు చేశారు.

ATM: ఏటీఎంను తెరిచేందుకు నానా తంటాలు పడి.. చివరకు ఏం చేశారో తెలిస్తే..


ఏపీ విభజన వల్ల వచ్చిన నష్టం కంటే జగన్ పాలన వల్ల ఇరిగేషన్ వచ్చిన నష్టం ఎక్కువన్నారు. సాగునీటికి చంద్రబాబు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. పట్టిసీమ లిఫ్ట్ నుంచి వచ్చిన నీళ్ళు ఇప్పుడు కృష్ణా డెల్టాలో దాహార్తి తీరుస్తున్నాయన్నారు. వైసీపీ నేతలు కళ్ళు తెరుచుకుని ఇదంతా చూడాలిని అన్నారు. ఇసుక మీద 40 వేల కోట్లు ఎలా కొట్టేయచ్చు, భూములు మైన్స్ ఎలా లోబరుచుకోవచ్చు అనే దానిపైనే వైసీపీ దృష్టి పెట్టిందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.


నీరు విడుదల

కాగా.. ఈరోజు ఉదయం ప్రకాశం బ్యారేజి నుంచి‌ కాలువలకు నీరు విడుదలయ్యాయి. పట్టిసీమ నుంచి కృష్ణాకు ఎనిమిది వేల క్యూసెక్కుల నీరు రానుంది. బ్యారేజి వద్ద 12 అడుగుల నీటి మట్టంతో ప్రవాహం కొనసాగుతోంది. కాలువల ద్వారా డెల్టా ప్రాంతానికి సాగు, తాగు నీరు విడుదల అయ్యాయి. మంత్రి నిమ్మల రామానాయుడు ప్రత్యేక పూజలు చేసి కాలువ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు.


ఇవి కూడా చదవండి..

MP Purandershwari: మోరంపూడి వంతెన నిర్మాణంపై మార్గాని భరత్‌ది అబద్దపు ప్రచారం...

Free Sand Scheme: సగం ధరకే ఇసుక..!

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 10 , 2024 | 12:03 PM