Share News

Nettem RaghuRam: కేశినేని నాని అవకాశవాది.. జగన్ అరాచక వాది

ABN , Publish Date - Jan 11 , 2024 | 03:55 PM

మాజీ ఎంపీ కేశినేని నాని ( Keshineni Nani ) అవకాశవాది.. సీఎం జగన్ ( CM Jagan ) అరాచక వాది అని టీడీపీ సీనియర్ నేత నెట్టెం రఘురాం ( Nettem Raghuram ) ఎద్దేవా చేశారు. గురువారం నాడు టీడీపీ కార్యాలయంలో నెట్టెం రఘురాం మీడియాతో మాట్లాడుతూ... ఓ అండర్ స్టాండింగుతోనే కేశినేని నాని జగన్ వద్దకు చేరారని నెట్టెం రఘురాం చెప్పారు.

 Nettem RaghuRam: కేశినేని నాని అవకాశవాది.. జగన్ అరాచక వాది

అమరావతి: మాజీ ఎంపీ కేశినేని నాని ( Keshineni Nani ) అవకాశవాది.. సీఎం జగన్ ( CM Jagan ) అరాచక వాది అని టీడీపీ సీనియర్ నేత నెట్టెం రఘురాం ( Nettem Raghuram ) ఎద్దేవా చేశారు. గురువారం నాడు టీడీపీ కార్యాలయంలో నెట్టెం రఘురాం మీడియాతో మాట్లాడుతూ... ఓ అండర్ స్టాండింగుతోనే కేశినేని నాని జగన్ వద్దకు చేరారని చెప్పారు. కేశినేని నాని పార్టీని వీడడం వల్ల నష్టమేం లేదన్నారు. కేశినేని నాని వెంట ఉన్న సహచరులు.. అనుచరులు టీడీపీలోనే ఉండిపోయారని తెలిపారు. వైసీపీలో జరుగుతున్న గందరగోళాన్ని.. సంక్షోభాన్ని చిన్నదిగా చూపడానికి నానిని వైసీపీ ఉపయోగించు కుంటోందన్నారు. 2019 తర్వాత కేశినేని నాని తీరు పార్టీకి ఇబ్బందికరంగా మారిందన్నారు. తానే అధిష్టానం అనే రీతిలో కేశినేని నాని వ్యవహరించారని మండిపడ్డారు. కీలక సమయాల్లో కేశినేని నాని పార్టీకి దూరంగా ఉన్నారన్నారు. మహానాడు కార్యక్రమాలకు హాజరు కాలేదని నెట్టెం రఘురాం చెప్పారు.

అలా చేయడం కేశినేని నాని అవివేకమే..

తాను అన్నింటికీ అతీతుడనే రీతిలో కేశినేని నాని వ్యవహరించారన్నారు. చాలా కాలం కేశినేని నాని విషయంలో పార్టీ ఉదారంగా వ్యవహరించిందని తెలిపారు. కేశినేని నానిని పార్టీ ఎప్పుడూ గౌరవిస్తూనే ఉందన్నారు. రెండుసార్లు టిక్కెట్టిచ్చిన చంద్రబాబుపై విమర్శలా..? పార్టీ కోసం పని చేస్తున్న యువనేత లోకేష్‌పై నిందలా..? అని ప్రశ్నించారు. టిక్కెట్ ఇవ్వడం లేదని చంద్రబాబు కేశినేని నానికి చెప్పలేదన్నారు. పార్టీని వీడి వెళ్లిన తర్వాత తన పరిస్థితేంటనేది కేశినేని నానికి భవిష్యత్తులో తెలుస్తుందన్నారు. రెండుసార్లు టిక్కెట్టిచ్చిన చంద్రబాబుపై విమర్శలా..? పార్టీ కోసం పని చేస్తున్న లోకేష్ పై నిందలా..? అని నిలదీశారు. పార్టీని వీడి వైసీపీలోకి వెళ్తే ఓట్లన్నీ వచ్చేస్తాయని అనుకోవడం అవివేకమని ఎద్దేవా చేశారు. అధికార కార్యక్రమాల్లో పాల్గొంటూ వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లడం.. వాళ్లని పొగడడం వంటివి చేశారని.. అప్పటి నుంచి కేశినేని నానిపై పలు అనుమానాలు మొదలయ్యాయని... నాని వెంట ఎవ్వరూ వెళ్లడం లేదని నెట్టెం రఘురాం పేర్కొన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 11 , 2024 | 04:02 PM