Vijayawada: ఏడాది పాటు ఘనంగా ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు..
ABN , Publish Date - Dec 13 , 2024 | 07:56 PM
ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలకు విజయవాడ వేదిక కానుందని టీడీపీ సీనియర్ నేత టీడీ జనార్దన్ చెప్పారు. నగరంలోని మురళీ రిసార్ట్స్‌లో శుక్రవారం ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు జనార్దన్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్: ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలకు విజయవాడ వేదిక కానుందని టీడీపీ సీనియర్ నేత టీడీ జనార్దన్ చెప్పారు. నగరంలోని మురళీ రిసార్ట్స్‌లో శుక్రవారం ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు జనార్దన్ వెల్లడించారు. సినీ వజ్రోత్సవ వేడుకలను ఏడాది పాటు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. శుక్రవారం జరిగే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు జనార్దన్ వెల్లడించారు.
Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన జగన్..
సీనియర్ ఎన్టీఆర్ తొలి సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన కృష్ణవేణి ఈ కార్యక్రమానికి హాజరవుతారని ఆయన చెప్పుకొచ్చారు. "తారకరమం" పేరుతో ఎన్టీఆర్ అంతరంగం పుస్తకాన్ని వజ్రోత్సవ వేడుకల్లో ఆవిష్కరిస్తున్నట్లు టీడీపీ సీనియర్ నేత చెప్పారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను భావితరాల కోసం పాఠ్య పుస్తకాల్లో పొందుపరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమాన్ని అభిమానులు పరోక్షంగా వీక్షించేందుకు లైవ్ లింక్ ఏర్పాటు చేస్తున్నట్లు జనార్దన్ చెప్పుకొచ్చారు. సూర్య, చంద్రులు ఉన్నంత కాలం అన్నగారి పేరు ఉంటుందని ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ చెప్పారు. నటనలో విశ్వవిఖ్యాతుడు ఎన్టీఆర్ అని, రాజకీయాలు, సినీ రంగంలో ఆయనో ధ్రువతారని అన్నారు. అలాంటి మహానుభావుడు పేరుతో సినీ వజ్రోత్సవ వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని రామకృష్ణ చెప్పారు.
Pawan: చంద్రబాబు వెన్నంటే ఉంటా
కాగా, ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. పెద్దఎత్తున ప్రముఖులు వస్తున్న నేపథ్యంలో ఏపీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. నిరంతరం తనిఖీలు చేస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. అలాగే పెద్దఎత్తున సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎటువంటి సమస్యా తలెత్తకుండా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
CM Babu: స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
CM Chandrababu: సరికొత్త చరిత్రకు నాంది