Share News

Musi: మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలు షురూ

ABN , Publish Date - Oct 01 , 2024 | 10:59 AM

Telangana: చాదర్‌ఘాట్ శంకర్ నగర్ బస్తీలో కూల్చివేతలను మంగళవారం ఉదయం అధికారులు ప్రారంభించారు. RB- X అని రాసి, ఇళ్ళు ఖాళీ చేసిన వాటిని అధికారులు కూల్చివేస్తున్నారు. ఎలాంటి అవాంతరాలు జరుగకుండా భారీగా పోలీసులను మోహరించారు. దాదాపు 140 ఇళ్లు ఖాళీ అయ్యాయి.

Musi: మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలు షురూ
Demolitions started in Musi catchment areas

హైదరాబాద్, అక్టోబర్ 1: మూసీ (Musi) పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలు మొదలయ్యాయి. చాదర్‌ఘాట్ శంకర్ నగర్ బస్తీలో కూల్చివేతలను మంగళవారం ఉదయం అధికారులు ప్రారంభించారు. RB- X అని రాసి, ఇళ్ళు ఖాళీ చేసిన వాటిని అధికారులు కూల్చివేస్తున్నారు. ఎలాంటి అవాంతరాలు జరుగకుండా భారీగా పోలీసులను మోహరించారు. దాదాపు 140 ఇళ్లు ఖాళీ అయ్యాయి. ఇళ్లు ఖాళీ చేసిన వారికి ప్రభుత్వం (Telangana Govt) ఇచ్చిన హామీ ప్రకారం డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించనున్నారు.

Hyderabad: మెట్రోస్టేషన్లలో పార్కింగ్‌ ఫీజు..


Hydraa.jpg

16 వేల నివాసాలు

కాగా.. మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌ను తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ను వరదల నుంచి రక్షించేందుకు, ఆక్రమణకు గురైన మూసీ నది పరివాహక ప్రాంతాలను పునరుద్ధరించి, కాలుష్య కోరల నుంచి మూసీని కాపాడేందుకు ప్రభుత్వం మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది.అధికారులు ముందుగా మూసీ నది ఎఫ్‌టీఎల్‌ పరిధిని సర్వే చేశారు. అందులో దాదాపు 16 వేల నివాసాలు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్నట్లు తేలింది. అందులో పేద, మధ్యతరగతి వారు నివసిస్తున్నారు. దీంతో ప్రభుత్వం.. మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌లో భాగంగా ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న పేదలకు ఉచితంగా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించింది. అందుకోసం ఇప్పటికే జీఓ కూడా జారీ చేసింది. అయితే డబుల్‌ బెడ్రూమ్‌లు ఎవరికి ఇవ్వాలనే దానిపై తాజాగా రెవెన్యూ అధికారులు సర్వే చేసి.. గుర్తించి ఇళ్లపై RB-X (Riverbed Extreme) అని రాశారు.


RB-X అని రాసిన ఇళ్ల కూల్చివేత

కాగా... ఇటీవల మూసీ నది పరివాహక ప్రాంతాల్లో అధికారులు పర్యటించి ఎఫ్‌టీఎల్‌ పరిధిలోకి వచ్చే ఇళ్లను గుర్తించి వాటిపై RB-X అని పెద్ద అక్షరాలతో పెయింట్‌ వేసిన విషయం తెలిసిందే. అయితే తమ ఇళ్లను కూల్చివేస్తారంటూ ఆందోళన చెందిన స్థానిక ప్రజలను అధికారులపై తిరగబడ్డారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే డబుల్ బెడ్‌ రూం ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ పలువురు స్థానికులు ఆందోళనకు దిగారు. మూసీ రివర్‌ బెడ్‌లో ఉన్న ఇళ్లు, వాటి యాజమానుల వివరాలు నమోదు చేసేందుకు వచ్చిన అధికారులను పలు ప్రాంతాల్లో నివాసితులు అడ్డుకున్నారు. చివరకు భారీ పోలీసులు భద్రత నడుమ రెవెన్యూ అధికారులు ఇళ్లపై RB-X అంటూ మార్క్ వేశారు. ప్రస్తుతం మరికొన్ని ప్రాంతాల్లో కూడా మార్క్‌ సర్వే ను అధికారులు కొనసాగిస్తున్నారు. పోలీసు భద్రత మధ్యే ఈ సర్వే సాగుతోంది. కూల్చివేయాల్సిన ఇళ్లకు అధికారులు మార్క్ వేస్తున్నారు. అక్కడి ప్రజలు ఇళ్లు ఖాళీ చేసిన వెంటనే అధికారులు ఆ ఇళ్లను కూల్చివేయనున్నారు.

musi-demolitions.jpg


ఇవి కూడా చదవండి...

లెబనాన్‌లోకి ఇజ్రాయెల్‌!

HYDRA: మూసీ పరివాహక ప్రాంతాల్లో హైఅలర్ట్... కారణమిదే

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 01 , 2024 | 11:47 AM