Share News

నదీమ్‌కు ఆల్టో కారు, గేదె

ABN , Publish Date - Aug 14 , 2024 | 02:09 AM

పాకిస్థాన్‌ బల్లెం వీరుడు, పారిస్‌ ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత అర్షద్‌ నదీమ్‌ను స్థానిక రాష్ట్ర ప్రభుత్వం సన్మానించింది. మంగళవారం పాక్‌లోని పంజాబ్‌ రాష్ట్ర సీఎం మరియం నవాజ్‌ షరీఫ్‌ స్వయంగా...

నదీమ్‌కు ఆల్టో కారు, గేదె
Arshad Nadeem

రూ.10 కోట్ల నజరానాతోపాటు వాహనం

లాహోర్‌: పాకిస్థాన్‌ బల్లెం వీరుడు, పారిస్‌ ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత అర్షద్‌ నదీమ్‌ను స్థానిక రాష్ట్ర ప్రభుత్వం సన్మానించింది. మంగళవారం పాక్‌లోని పంజాబ్‌ రాష్ట్ర సీఎం మరియం నవాజ్‌ షరీఫ్‌ స్వయంగా నదీమ్‌ స్వగ్రామం ఖనేవాల్‌కు వెళ్లి, అతడిని అభినందించారు. పాక్‌ కరెన్సీలో రూ.10 కోట్ల నగదు బహుమతితో పాటు హోండా సివిక్‌ కారును నదీమ్‌కు ప్రదానం చేశారు. అంతేకాక ఈ వాహనానికి 92.97 నెంబర్‌ను కేటాయించారు. నదీమ్‌ ఒలింపిక్స్‌లో జావెలిన్‌ను 92.97 మీటర్ల దూరం విసిరిన సంగతి తెలిసిందే.

అల్లుడూ..ఇదిగో గిఫ్ట్‌ : నదీమ్‌కు ఒక పక్క కార్లు, నగదు పురస్కారాలు వచ్చి పడుతుంటే తన మామ మహ్మద్‌ నవాజ్‌ గేదెను బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. నదీమ్‌ స్వగ్రామమైన ఖనేవాల్‌ పరిసర ప్రాంతాల్లో గేదెలను కలిగి ఉండడం గౌరవమట.


ఆల్టో కారు బహుమతిపై ట్రోలింగ్‌..

నదీమ్‌ సాధించిన ఒలింపిక్‌ పతకానికి మెచ్చి పాకిస్థాన్‌కు చెందిన అమెరికా వ్యాపారవేత్త అలీ షేఖానీ అతడికి మారుతిసుజుకి ఆల్టో కారును ఇస్తానని ప్రకటించాడు. ఈ కారు పాక్‌ కరెన్సీలో రూ.23 లక్షలుగా ఉంది. ‘అతడికి బీఎండబ్ల్యూ, ఆడీ వంటి కార్లను ఇవ్వాలి కానీ ఇలాంటి చిన్నకార్లు ఇచ్చి అవమానించొద్దు’ అని సోషల్‌ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది.

7-Sports.gif

Updated Date - Aug 14 , 2024 | 12:43 PM