Hyderabad: ఆశకు పోతే ఉన్నది ఊడ్చేశారు..
ABN , Publish Date - Sep 11 , 2024 | 11:51 AM
ఆన్‌లైన్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయన్న సైబర్ నేరగాళ్ల(Cyber criminals) ఉచ్చులో ఇద్దరు వృద్ధులు చిక్కారు. వారి మాటలు నమ్మి జీవితాంతం కష్టపడి సంపాదించిన సొమ్మును వారికి పంపారు. కేటుగాళ్ల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సకాలంలో సైబర్ క్రైమ్ పోలీసులను(Cyber Crime Police) ఆశ్రయించగా, వారు బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు.
- ఇద్దరు వృద్ధులను వంచించిన సైబర్ నేరగాళ్లు
- రికవరీ చేసిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు
- రూ. 1.09 కోట్లు బాధితుల ఖాతాల్లో జమ
హైదరాబాద్ సిటీ: ఆన్‌లైన్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయన్న సైబర్ నేరగాళ్ల(Cyber criminals) ఉచ్చులో ఇద్దరు వృద్ధులు చిక్కారు. వారి మాటలు నమ్మి జీవితాంతం కష్టపడి సంపాదించిన సొమ్మును వారికి పంపారు. కేటుగాళ్ల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సకాలంలో సైబర్ క్రైమ్ పోలీసులను(Cyber Crime Police) ఆశ్రయించగా, వారు బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. అందులో ఉండిపోయిన రూ.1.09 కోట్లను నిలిపివేశారు సైబర్ క్రైమ్ డీసీపీ కవిత తెలిపిన వివరాల ప్రకారం.. బేగంపేట(Begumpet)కు చెందిన 52 ఏళ్ల వ్యక్తి ఆన్‌లైన్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయంటే నమ్మాడు.
ఇదికూడా చదవండి: Hyderabad: మెదక్ సర్కిల్ శివంపేట సెక్షన్ ఏఈ సస్పెన్షన్..
సైబర్ నేరగాళ్లు చెప్పినట్టు తొలుత చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టిన బాధితుడికి అధిక మొత్తంలో లాభాలు వచ్చినట్టు చూపించిన క్రిమినల్స్.. మెల్లగా ఊబిలోకి దింపారు. ఆ తర్వాత విడతల వారీగా అతడి నుంచి రూ.1.22 కోట్లు బదిలీ చేయించుకొని ఆ తర్వాత ఫోన్ చేయడం మానేశారు. దీంతో కంగుతిన్న బాధితుడు వెంటనే సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో క్రిమినల్స్ వినియోగించిన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసి రూ.80 లక్షలు రికవరీ చేశారు.
మరో కేసులో..
గోల్డ్‌మన్ స్టాక్స్ సెక్యూరిటీస్ లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించిన సైబర్ క్రిమినల్స్ నగరానికి చెందిన 62 ఏళ్ల వృద్ధుడి నుంచి రూ.32 లక్షలు కొల్లగొట్టారు. ఆ తర్వాత నేరస్థుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో బాధితుడు సకాలంలో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసి రూ.29.10 లక్షలను రికవరీ చేశారు.
గోల్డెన్ అవర్‌లో ఫిర్యాదు చేయాలి..
సైబర్ క్రిమినల్స్ చేతికి చిక్కి డబ్బులు పోగొట్టుకుంటున్న బాధితులు గుర్తించిన మొదటి గంటలోపు (గోల్డెన్ అవర్) పోలీసులను ఆశ్రయించాలి. లేదంటే ఎన్‌సీఆర్‌పీ పోర్టల్‌లో లేదా 1930 టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలి. పోలీసులు సకాలంలో స్పందించి సాంకేతిక ఆధారాలు సేకరించి సైబర్ నేరగాళ్లు కొట్టేసిన సొత్తును ఫ్రీజ్ చేసి బాధితులకు న్యాయం జరిగేలా చేస్తారు. న్యాయస్థానం అనుమతితో రికవరీ చేసిన సొమ్మును తిరిగి వారి ఖాతాలో జమ చేయిస్తున్నాం.
కవిత, సైబర్ క్రైమ్ డీసీపీ
.......................................................
ఈ వార్తను కూడా చదవండి:
.......................................................
Hyderabad: విదేశీ నేరస్థుడి బహిష్కరణ..
- ఘరానా స్మగ్లర్‌ను ఇండియా నుంచి పంపిన పోలీసులు
హైదరాబాద్ సిటీ: వీసా గడువు ముగిసినా నగరంలో ఉంటూ డ్రగ్స్ స్మగ్లింగ్(Drug smuggling) చేస్తున్న విదేశీయుడిని హెచ్‌న్యూ (హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్) పోలీసులు దేశం నుంచి బహిష్కరించారు. 2009లో టూరిస్టు వీసాపై ఇండియాకు వచ్చిన ఐకేజీ ఇన్నోసెంట్ ఎన్‌డుకా.. ముంబైలో తిష్టవేసి స్కార్ఫ్ బిజినెస్ ప్రారంభించాడు. గుజరాత్(Gujarat)లోని సూరత్ నుంచి వస్తువులు కొనుగోలు చేసి ముంబైలో వ్యాపారం చేశాడు. ఏడాది తర్వాత తమిళనాడు(Tamil Nadu)కు మకాం మార్చాడు.
తిర్పూర్‌లో 4 సంవత్సరాల పాటు టీషర్ట్‌లు విక్రయించాడు. ఆ తర్వాత 2014లో తమిళనాడు నుంచి మకాంను బెంగళూరుకు మార్చాడు. అక్కడ మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌లోకి దిగి, గుట్టుగా ఇతర నైజీరియన్స్‌తో కలిసి డ్రగ్స్ దందా మొదలుపెట్టాడు. దీనిలో భాగంగా ఈ ఏడాది మేలో హైదరాబాద్ వచ్చి డ్రగ్స్ విక్రయిస్తూ పోలీసులకు చిక్కాడు. అతడిని విచారించగా టూరిస్టు వీసాపై వచ్చి కొన్నేళ్లుగా ఇండియాలో అక్రమంగా ఉంటున్నట్లు తేలింది. అసలు ఐడెంటిటీని దాచిపెట్టి, దేశం, తన పేరుతో నకిలీవి క్రియేట్ చేసుకొని ఒక్కో నగరంలో ఒక్కో పేరుతో చెలామణి అయినట్లు పోలీసుల విచారణలో గుర్తించారు.
నైజీయా దేశానికి వెళ్లేటప్పుడు మాత్రం ఒరిజినల్ ఐడెంటిటీతో నేరచరిత్ర లేని వ్యక్తిగా క్లీన్ చిట్‌తో వెళ్తున్నారని హెచ్‌న్యూ పోలీసులు గుర్తించారు. ఇలాంటి కేటుగాళ్లు అక్రమంగా దేశంలో ఉంటూ డ్రగ్స్ మహమ్మారిని విచ్చలవిడిగా సరఫరా చేస్తూ వేలాది మంది యువతను వాటికి బానిసలను చేస్తున్నారు. అలాంటి వారిని దేశం నుంచి డిపోర్టేషన్ (బహిష్కరణ) చేయడమే సరైన మార్గం అని పోలీసులు భావిస్తున్నారు. మూడు నెలల్లో ముగ్గురు నైజీరియన్లను ఇలా డిపోర్టేషన్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి:Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి:Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...
Read LatestTelangana NewsandNational News