Share News

Trainee Doctor Father: సీఎం కోరినా బెంగాల్లో దుర్గాపూజను ఎవరూ జరుపుకోరన్న ట్రైనీ డాక్టర్ తండ్రి!

ABN , Publish Date - Sep 11 , 2024 | 12:15 PM

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ అత్యాచారం హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో నిరసనల కంటే దుర్గాపూజ వేడుకలపై దృష్టి పెట్టాలని మమతా ప్రజలకు చేసిన విజ్ఞప్తిపై బాధితురాలి తండ్రి స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు.

Trainee Doctor Father: సీఎం కోరినా బెంగాల్లో దుర్గాపూజను ఎవరూ జరుపుకోరన్న ట్రైనీ డాక్టర్ తండ్రి!
trainee doctor father bengal

కోల్‌కతా(west bengal) ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో సీఎం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పలు విమర్శలు ఎదుర్కొంటున్నారు. వైద్యుల నిరసన కొనసాగుతుండడంతో ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాధితురాలి తండ్రి మమతపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కేసును సీఎం మమతా పట్టించుకునే విషయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిరసనల కంటే దుర్గాపూజ వేడుకలపై దృష్టి పెట్టాలని మమతా ప్రజలకు చేసిన విజ్ఞప్తిపై బాధితురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది దుర్గాపూజను ఎవరూ జరుపుకోరని భావిస్తున్నామని వెల్లడించారు. ఎవరైనా జరుపుకున్నా, వారు సంతోషంగా జరుపుకోరని అన్నారు. ఎందుకంటే బెంగాల్ ప్రజలందరూ తన కుమార్తెను వారి కుమార్తెగా భావిస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు.


సీఎం పట్టించుకుంటే

ఈ కేసు విషయంలో బెంగాల్ ముఖ్యమంత్రి ఏ పనీ చేయలేదని బాధితురాలి తండ్రి ఆరోపించారు. ఈ కేసులో సంజయ్ రాయ్‌ను మాత్రమే అరెస్టు చేశారని ట్రైనీ డాక్టర్ తండ్రి తెలిపారు. ఇందులో డిపార్ట్‌మెంట్‌కు చెందిన వ్యక్తుల ప్రమేయం ఉందని మొదటి నుంచి చెబుతున్నామని పేర్కొన్నారు. ఈ కేసులో ముఖ్యమంత్రి పాత్రపై సంతృప్తిగా ఉంటే సీబీఐ వరకు వెళ్లేది కాదన్నారు. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత నిందితుల్లో ఒకరైన సంజయ్‌రాయ్‌ని లేచి నిలబెట్టి, పని అంతా అయిపోయిందని చెప్పారు. ఈ కేసు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో విచారణకు వచ్చి ఉరిశిక్ష వేస్తమన్నారు తప్ప ఏం చేయలేదన్నారు.


నిరసనలు ఆపాలి

పశ్చిమ బెంగాల్లో నెలరోజులుగా కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో మమతా బెనర్జీ ప్రజలు పండుగలకు తిరిగి రావాలని విజ్ఞప్తి చేశారు. నిరసనల వల్ల ఆటంకాలు ఏర్పడుతున్నాయని మమతా బెనర్జీ పేర్కొన్నారు. శాంతిభద్రతలు, సాధారణ జీవనానికి రావాలని పిలుపునిచ్చారు. సోమవారం రాష్ట్ర సెక్రటేరియట్‌లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఉత్సవాలకు తిరిగి రావాలని, వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేయడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ని అనుమతించాలని అభ్యర్థిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటన విషయంలో త్వరితగతిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు, ప్రజల మద్దతుతో నిరసనలు చేస్తున్నారు.


తగ్గేదేలే

ఇదిలావుండగా పశ్చిమ బెంగాల్‌లో నిరసన తెలుపుతున్న జూనియర్ వైద్యులు మంగళవారం సాయంత్రం 5 గంటలలోగా విధులకు తిరిగి రావాలని సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించారు. అయితే తమ నిరసన కొనసాగుతుందని వైద్యులు తెలిపారు. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు, ఆర్‌జి కర్ ఆసుపత్రిలో అత్యాచారం, హత్య బాధితురాలికి న్యాయం జరిగే వరకు ధర్నా కొనసాగిస్తామన్నారు.


ఇవి కూడా చదవండి:

GNSS: జాతీయ రహదారిపై నో టోల్ ట్యాక్స్.. ఎన్ని కిలోమీటర్ల వరకంటే


కొనసాగుతున్న ఉద్రిక్తత.. నేడు కూడా స్కూళ్లు, కాలేజీలు, ఇంటర్నెట్ బంద్


TRAI: కోటికిపైగా ఫేక్ మొబైల్ కనెక్షన్‌లు తొలగింపు.. కారణమిదే..

Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు

Read MoreNational News and Latest Telugu News

Updated Date - Sep 11 , 2024 | 12:22 PM