Secretariat: సచివాలయంలో పాతుకుపోయిన వైసీపీ అనుకూల అధికారులు.. వారు చేస్తున్న బాగోతం ఇదీ!
ABN , Publish Date - Aug 22 , 2024 | 10:31 AM
Andhrapradesh: అసెంబ్లీలో ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయి... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అధికారుల్లో మాత్రం మార్పు రాలేదు. ఏకంగా సచివాలంలో వైసీపీ అనుకూల అధికారుల బరితెగింపులకు పాల్పడ్డారు. సస్పెన్షన్‌లో ఉన్న సచివాలయం ఉద్యోగి సంఘనాయకుడు వెంకట్రామిరెడ్డికి అనుకూలంగా పావులు కదుపుతున్న వైనం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అమరావతి, ఆగస్టు 22: అసెంబ్లీలో ఎన్నికల్లో వైసీపీ (YSRCP) ఘోరంగా ఓడిపోయి... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అధికారుల్లో మాత్రం మార్పు రాలేదు. ఏకంగా సచివాలంలో (AP Secretariat) వైసీపీ అనుకూల అధికారుల బరితెగింపులకు పాల్పడ్డారు. సస్పెన్షన్‌లో ఉన్న సచివాలయం ఉద్యోగి సంఘనాయకుడు వెంకట్రామిరెడ్డికి అనుకూలంగా పావులు కదుపుతున్న వైనం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 2024 మార్చి 31న కడప, బద్వేలు, ప్రొద్దుటూరు, మైదుకూరులో ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకుడు చంద్రయ్యతో కలిసి వైసీపీకి అనుకూలంగా వెంకటరామిరెడ్డి ప్రచారం చేశాడు.
US Arrest: రహస్య కెమెరాలతో మహిళలు, పిల్లల నగ్న వీడియోలు..
అయితే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఆయనపై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. ఆయనపై చార్జెస్ ప్రేమ్ చేసి పంపాల్సిన అధికారుల్లో అలసత్వం కొట్టొచ్చిన్నట్లు కనిపిస్తోంది. నెలలు గడుస్తున్నప్పటికీ ప్రాసెస్ చేయకపోవడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆయనపై చార్జెస్ ఫ్రేమ్ చేయకుండానే మరో ఇద్దరు ఉద్యోగులతో కలపి వెంకట్రామిరెడ్డి పేరును చేర్చి సస్పెన్సన్ రివోక్‌కు ఫైలు పంపించినట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటకు పొక్కడంతో నిన్న రాత్రి హుటాహుటిన ఆయనపై అభియోగాలు మోపుతూ 10 రోజుల్లో సమాధానం కోరుతూ లేఖ రాశారు సదరు అధికారులు. నాలుగు నెలలకు పైగా తాత్సారం చేసి సంభందిత శాఖ అధికారులు.. తీరా విషయం బయటకు పొక్కడంతో ఇప్పుడు అభియోగాలు మోపడం విమర్శలు తావిస్తోంది.
సీసీఏ నిబంధనల ప్రకారం అభియోగాలు నమోదు చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది. అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి సంజాయిషీ ఇచ్చాక క్రమశిక్షణ చర్యలు ఉంటాయంటూ వెల్లడించింది. ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడినందుకు రోసా నిబంధనల ప్రకారం అసోసియేషన్ను కూడా రద్దు చెయ్యొచ్చని నిబంధనలు ఉన్నాయి. అయితే ఆది నుంచి వెంకట్రామిరెడ్డి విషయంలో అధికారులు మెతక వైఖరితో ఉండటం సర్వత్రా విస్మయానికి గురిచేస్తోంది. పంచాయితీరాజ్, రిజిస్ట్రేషన్లు- ఎక్సైజ్, ట్రాన్సపోర్ట్, హెల్త్, మైన్స్ శాఖల్లో మిడిల్ లెవల్ ఆఫీసర్లుగా వైసీపీ అనుకూల అధికారులు ఇంకా పాతుకుపోయారు. వెంకట్రామిరెడ్డి సస్పెన్సన్ రివోక్ విషయంలో పంచాయితీరాజ్ శాఖలోని మిడిల్ లెవల్ ఆఫీసర్ చక్రం తిప్పినట్లు సమాచారం.
డిసెంబరులోపు కొత్త క్రీడా పాలసీ
అయిదు శాఖల్లోని మిడిల్ లెవల్‌లో పనిచేస్తున్న కోందరు అధికారులు నేటికి సజ్జలతో టచ్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ ఐదు శాఖల్లో ప్రక్షాళన తప్పనిసరి అని సచివాలయ వర్గాలు చెబుతున్నమాట. వీరు అక్కడ కొనసాగుతూ తమకు వ్యతిరేకం అనుకున్న కింది స్ధాయి ఉద్యగులను ఏదో రూపంలో నిత్యం వేదిస్తున్నట్టు ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. బదిలీల్లోనూ వేలు పెట్టి వైసీపీ అనుకూల ఉద్యోగులను కింది స్థాయిలో నియమించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చూస్తున్నట్లు సమాచారం. వీరే వెంకట్రామిరెడ్డి లాంటివారిని కాపాడుతున్నారని.. వీరికి ఐఏఎస్ స్ధాయి అధికారులు కూడా వంత పాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నారు. మరో నెలరోజులు పాటు వెంకట్రామిరెడ్డిపై చర్యలు లేకపోతే 6 నెలలు పూర్తయి ఆటోమెటిక్‌గా రీఇనిస్టేట్ అవుతారని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. సో... వెంకట్రామిరెడ్డిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి..
ఇవి కూడా చదవండి...
AP Government: అచ్యుతాపురం మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
Harish Rao: యాదాద్రికి బయలు దేరిన హరీష్‌రావు.. నేడు రుణమాఫీపై బీఆర్ఎస్ ధర్నా
Read Latest AP News And Telugu News