Share News

Chandrababu: అందరికీ నవమి శుభాకాంక్షలు.. ప్రజల ఆనందమే ముఖ్యమని చెబుతోంది రామకథ..

ABN , Publish Date - Apr 17 , 2024 | 11:32 AM

Andhrapradesh: ప్రజలందిరికీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత స్పందిస్తూ.. ‘‘తేత్రాయుగం నాటి రామరాజ్యం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం. అంటే దానికి కారణం... ప్రజల మనోభావాలకు అనుగుణంగా సాగిన శ్రీరాముని పాలన. పాలకులు తన కుటుంబం కంటే ప్రజల ఆనందమే ముఖ్యమని భావించాలని రామకథ చెబుతుంది’’ అని చంద్రబాబు అన్నారు.

Chandrababu: అందరికీ నవమి శుభాకాంక్షలు.. ప్రజల ఆనందమే ముఖ్యమని చెబుతోంది రామకథ..
TDP Chief Chandrababu Sriramanavami Wishes

అమరావతి, ఏప్రిల్ 17: ప్రజలందిరికీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) శ్రీరామ నవమి శుభాకాంక్షలు (Srirama Navami Wishes) తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత స్పందిస్తూ.. ‘‘తేత్రాయుగం నాటి రామరాజ్యం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం. అంటే దానికి కారణం... ప్రజల మనోభావాలకు అనుగుణంగా సాగిన శ్రీరాముని పాలన. పాలకులు తన కుటుంబం కంటే ప్రజల ఆనందమే ముఖ్యమని భావించాలని రామకథ చెబుతుంది. అటువంటి వారి పాలనలోనే ఊరు పచ్చగా ఉంటుంది... సమాజంలో శాంతి వెల్లివిరుస్తుంది. మరి కొద్దిరోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అటువంటి శుభిక్షమైన సుఖశాంతులతో కూడిన రామరాజ్యం నాటి పాలన అంది రావాలని కోరుకుంటూ... అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు’’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

PM Modi: ఈ శుభ సందర్భంలో నా మనస్సు భావోద్వేగంతో నిండిపోయింది.. ప్రధాని మోదీ


ఊరూవాడా సంబరాలు...

మరోవైపు శ్రీరామ నవమి సందర్భంగా ఊరూవాడ శ్రీసీతారాము కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. శ్రీరామ స్మరణతో ప్రజలు కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొంటున్నారు. అటు భద్రాచలంలో రాముల వారి కళ్యాణ క్రతువు ప్రారంభమైంది. తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎం శాంతి కుమారి స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు. మిథులా స్టేడియంలో రామయ్య కళ్యాణం జరుగుతోంది. ఆ దేవదేవుని కళ్యాణాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. ప్రస్తుతం రాముల వారికి కళ్యాణం కొనసాగుతోంది. ఈరోజు ఉదయం 10:30 గంటలకు కళ్యాణోత్సవం ప్రారంభం అవగా.. అభిజిత్ లగ్నంలో సీతారామయ్యలకు రుత్వికులు జీలకర్ర బెల్లం పెట్టించనున్నారు. అటు ఏపీలోని కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ఈరోజు ధ్వజారోహణం జరుగనుంది.


ఇవి కూడా చదవండి..

Tulasireddy: జగన్ రెడ్డి కాదు - జలగ రెడ్డి

YCP: రాళ్ల దాడి ఘటనలో బోండా ఉమ టార్గెట్‌గా పావులు కదుపుతున్న వైసీపీ..!

మరిన్ని ఏపీ వార్తల కోసం..

Updated Date - Apr 17 , 2024 | 02:37 PM