Share News

Puzzle: మీ బ్రెయిన్‌కు అసలైన పరీక్ష.. ఈ ఫొటోలో ఉన్న తప్పేంటో 6 సెకెన్లలో కనిపెట్టండి..!

ABN , Publish Date - Apr 17 , 2024 | 10:31 AM

తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. ఒక సమస్య పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది

Puzzle: మీ బ్రెయిన్‌కు అసలైన పరీక్ష.. ఈ ఫొటోలో ఉన్న తప్పేంటో 6 సెకెన్లలో కనిపెట్టండి..!
పజిల్ ఫొటో

పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Opitcal Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. ఒక సమస్య పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది.


బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది.


వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ఓ అబ్బాయి, అమ్మాయి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేస్తున్నారు. ఆ టేబుల్ మీద చాలా ఆహార పదార్థాలున్నాయి. అయితే ఆ ఫొటోలో ఓ తప్పు ఉంది. ఆ తప్పు ఏంటో కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 6 సెకెన్ల వ్యవధిలో ఆ తప్పును కనిపెట్టెస్తే మీ పరిశీలనా శక్తి గొప్పది అని నమ్మొచ్చు.. కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. ఆ తప్పేంటో తెలిసిపోతుంది. ఆ ఫొటోలోని అబ్బాయి చాప్ స్టిక్స్‌తో సూప్ తాగేందుకు ప్రయత్నిస్తున్నాడు.

puzzle2.jpg

ఇవి కూడా చదవండి..

Puzzle: మీ బ్రెయిన్ షార్ప్ అయితే.. పెన్, పేపర్ లేకుండా ఈ చిన్న పజిల్‌ను 30 సెకెన్లలో సాల్వ్ చేయండి..!


Viral Video: కాకి నుంచి చేపను రక్షించిన కొంగ.. తర్వాత ఏం చేసిందో చూడండి.. వీడియో వైరల్!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 17 , 2024 | 10:31 AM