Telangana Employees: మమ్మల్ని రిలీవ్ చేయండి.. తెలంగాణ ఉద్యోగుల వినతి
ABN , Publish Date - Jul 04 , 2024 | 02:16 PM
Andhrapradesh: ఏపీ నుంచి తమను రిలీవ్ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యోగులు వినతి చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో 712 మంది స్థానికత ఉన్న ఉద్యోగులు పని చేస్తున్నారు. సచివాలయం, హెచ్వోడీలు, 9,10వ షెడ్యూల్ సంస్థల్లో పని చేస్తున్న 224 మంది రాష్ట్ర కేడర్ ఉద్యోగులను కూడా రిలీవ్ చేయాలని ఏపీలోని తెలంగాణ ఉద్యోగులు కోరుతున్నారు.
అమరావతి, జూలై 4: ఏపీ (Andhrapradesh) నుంచి తమను రిలీవ్ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యోగులు (Telangana Employees) వినతి చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో 712 మంది స్థానికత ఉన్న ఉద్యోగులు పని చేస్తున్నారు. సచివాలయం, హెచ్వోడీలు, 9, 10వ షెడ్యూల్ సంస్థల్లో పని చేస్తున్న 224 మంది రాష్ట్ర కేడర్ ఉద్యోగులను కూడా రిలీవ్ చేయాలని ఏపీలోని తెలంగాణ ఉద్యోగులు కోరుతున్నారు. సీనియార్టీ కోల్పోయినా ఫర్వాలేదని.. తమను తమ రాష్ట్రానికి పంపాలని వారు విజ్ఞప్తి చేశారు.
Peddirreddy : ఇంటి కోసం మున్సిపాలిటీ రోడ్డును ఆక్రమించిన పెద్దిరెడ్డి..
విభజన జరిగి పదేళ్లు అయినా స్థానికత ఆధారంగా తమను స్వరాష్ట్రానికి పంపకపోవడంపై తెలంగాణ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ విజ్ఞప్తులను పరిష్కరించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu), తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని (Telangana CM Revanth Reddy) ఎంప్లాయిస్ అభ్యర్థిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో తమ అంశంపై చర్చించాలని ఏపీలోని తెలంగాణ ఉద్యోగులు వినతి చేస్తున్నారు.
PM Modi: ప్రధాని మోదీని కలిసిన టీమిండియా.. ఏం మాట్లాడారంటే?
కాగా... ఈ నెల 6వ తేదీన హైదరాబాద్‌లోని (Hyderabad) ప్రజాభవన్‌లో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశంకానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దీనిపై స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. అందుకు రేవంత్ అంగీకారం తెలిపారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తి అయిన సందర్భంలో సంబంధిత అంశాలపై ముఖాముఖి చర్చించుకుందామని చంద్రబాబు ప్రతిపాదించారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం అధికారికంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
AP High Court: వైసీపీ ఆఫీసుల విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు..
TDP: జగన్ వ్యాఖ్యలపై రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి కౌంటర్..
Read Latest AP News AND Telugu News