PM Modi: ప్రధాని మోదీని కలిసిన టీమిండియా.. ఏం మాట్లాడారంటే?
ABN , Publish Date - Jul 04 , 2024 | 01:53 PM
బార్బడోస్ నుంచి భారత్‌కు తిరిగొచ్చిన టీమిండియా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యింది. తొలుత ఐటీసీ మౌర్యలో కేక్ కట్ చేసిన ఆటగాళ్లు.. అక్కడి నేరుగా ప్రధాని నివాసానికి వెళ్లి మోదీని కలిశారు.
బార్బడోస్ నుంచి భారత్‌కు తిరిగొచ్చిన టీమిండియా (Team India) ప్రధాని నరేంద్ర మోదీతో (PM Narendra Modi) భేటీ అయ్యింది. తొలుత ఐటీసీ మౌర్యలో కేక్ కట్ చేసిన ఆటగాళ్లు.. అక్కడి నేరుగా ప్రధాని నివాసానికి వెళ్లి మోదీని కలిశారు. తాము గెలిచిన ట్రోఫీని (20 World Cup Trophy) ప్రధానికి అందజేసి.. ఫోటోలు దిగారు. ఆపై ఆటగాళ్లందరిని మోదీ ఆప్యాయంగా పలకరించారు. వరల్డ్‌కప్ గెలిచినందుకు ప్రతిఒక్కరికీ అభినందనలు తెలిపారు. అంతేకాదు.. ఈ టోర్నీలో ప్రయాణం ఎలా సాగింది? ఎదుర్కొన్న సవాళ్లేంటి? ట్రోఫీ గెలిచేందుకు చేసిన కృషి ఏంటి? వంటి వివరాలను ఒక్కొక్కరిని అడిగి తెలుసుకున్నారు. అందరితోనూ కాసేపు ముచ్చటించారు.
మొదట హెడ్ కోచ్ (ప్రస్తుతం మాజీ) రాహుల్ ద్రవిడ్‌తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మతో (Rohit Sharma) ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా.. ట్రోఫీ గెలవడంలో ఆటగాళ్లు చేసిన కసరత్తుల గురించి ఆ ఇద్దరు వివరించారు. ముఖ్యంగా.. విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆడిన కీలక ఇన్నింగ్స్‌తో పాటు సూర్య పట్టిన ప్రతిష్ఠాత్మక క్యాచ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. ఇక పడిలేచిన కెరటంలా ఈ టోర్నీలో హార్దిక్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు కాబట్టి.. ఆ అనుభవాలను అతను మోదీతో షేర్ చేసుకున్నాడు. మిగిలిన ఆటగాళ్లందరూ తమతమ అనుభవాలను, ఫీలింగ్స్‌ని ప్రధానితో పంచుకున్నారు. అనంతరం ఆటగాళ్లతో కలిసి మోదీ అల్పాహారం సేవించారు. ఇందుకు సంబంధించిన వీడియోని ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.
ఇదిలావుండగా.. దాదాపు 11 ఏళ్ల నిరీక్షణ తర్వాత భారత జట్టు ఐసీసీ ట్రోఫీని కైవసం చేసుకుంది. చివరిసారిగా ఎంఎస్ ధోనీ సారథ్యంతో 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత్.. ఇన్నేళ్ల తర్వాత టీ20 వరల్డ్‌కప్ నెగ్గింది. కేవలం టీ20 వరల్డ్‌కప్‌ను దక్కించుకోవడానికి 17 ఏళ్లు పట్టింది. అందుకే.. భారత్‌లో సంబరాలు అంబరాన్ని అంటాయి. భారతీయ ఆటగాళ్లకు అపూర్వ స్వాగతం లభించింది. ముఖ్యంగా.. విరాట్ కోహ్లీ ఫ్యాన్ ఆ వరల్డ్‌కప్ విజేతగా ఘనస్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టులో వస్తుండగానే.. కోహ్లీ కోహ్లీ అంటూ నినాదాలతో విమానాశ్రయాన్ని హోరెత్తించేశారు. ఫైనల్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినందుకే.. కోహ్లీకి ఈ అపూర్వ స్వాగతం లభించింది.
Read Latest Sports News and Telugu News