YSRCP: ఆరోపణలు, ప్రత్యారోపణలతో రసాభాసగా వైసీపీ సమావేశం
ABN , Publish Date - Jul 04 , 2024 | 01:50 PM
విశాఖలో జరిగిన వైసీపీ నేతల సమావేశం ఆరోపణలు, ప్రత్యారోపణలతో రసాభాసగా మారింది. ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమికి కారణం మీరంటే మీరంటూ... ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు.
విశాఖ: విశాఖలో జరిగిన వైసీపీ నేతల సమావేశం ఆరోపణలు, ప్రత్యారోపణలతో రసాభాసగా మారింది. ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమికి కారణం మీరంటే మీరంటూ... ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. 40 శాతం ఓట్లు పార్టీకి పడినా నేతల నిర్వాకం వల్ల ఓడిపోయామని కేడర్ ఆవేదన వ్యక్తం చేసింది. నేతల తీరు మారకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బహిరంగానే హెచ్చరికలు చేసింది. మరోవైపు వైసీపీ నేతలంతా గ్రూపులుగా విడిపోయి మరీ ఒకరిపై మరొకరు పరస్పర విమర్శలు చేసుకున్నారు.
గుడివాడ అమర్ నాథ్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విశాఖ వైసీపీ చీలిపోయింది. విశాఖ జిల్లా పార్టీ పగ్గాలను గుడివాడ అమర్‌నాథ్‌కి అప్పగించాలని ఓ వర్గం డిమాండ్ చేసింది. ఎండాడ వైసీపీ కార్యాలయంలో ఎన్నికల్లో ఓటమి తర్వాత నేతలు తొలిసారిగా సమావేశమయ్యారు. మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇక మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తదితరులు డుమ్మా కొట్టారు.