Share News

AP News: బోదవాడ అగ్ని ప్రమాదంలో ఇద్దరు కార్మికుల మృతి

ABN , Publish Date - Jul 07 , 2024 | 08:10 PM

జిల్లాలోని జగ్గయ్యపేట మండలంలోని బూదవాడ (Budawada) లోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ (Ultratech cement factory)లో బాయిలర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతిచెందారు.

AP News: బోదవాడ అగ్ని ప్రమాదంలో ఇద్దరు కార్మికుల మృతి

ఎన్టీఆర్ జిల్లా: జిల్లాలోని జగ్గయ్యపేట మండలంలోని బూదవాడ (Budawada) లోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ (Ultratech cement factory)లో బాయిలర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతిచెందారు. మృతులు ఆవుల వెంకటేష్‌, పరిటాల అర్జున్‌ గుర్తించారు. ఈ ప్రమాదంలో సుమారు 20మందికి తీవ్రగాయాలు అయ్యాయి.

బాధితులకు జగ్గయ్యపేట, విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితులంతా బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కార్మికులుగా గుర్తించారు. బాయిలర్ పేలి తీవ్రగాయాలతో ఉన్న కార్మికులను యాజమాన్యం పట్టించుకోవడం లేదంటూ బూదవాడ గ్రామస్థులు కంపెనీ కార్యాలయంపై దాడి చేశారు. అద్దాలు ధ్వంసం చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అయితే కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ ఇప్పటికే స్పందించారు. పేలుడుకు ప్రీ హీటర్ లోపమే కారణమని ప్రాథమికంగా తేలిందని మంత్రి చెప్పారు. ప్రీ హీటర్ నిర్వహణలో అల్ట్రాటెక్ సంస్థ పూర్తిగా విఫలమైందని, అందుకే ప్రమాదం జరిగినట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని మంత్రి వాసంశెట్టి సుభాశ్ అధికారులను ఆదేశించారు.

Updated Date - Jul 07 , 2024 | 08:17 PM