Share News

AP Assembly: జగన్ అసెంబ్లీకి వస్తారా.. డుమ్మా కొడతారా..!

ABN , Publish Date - Jun 17 , 2024 | 11:18 AM

ఏపీ అసెంబ్లీ సమావేశాలు జూన్ 19న ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరుగుతోంది. ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారు. ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలతో ప్రోటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి 135 మంది, జనసేన నుంచి 21, వైసీపీ నుంచి 11 మంది, బీజేపీ నుంచి 9 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు.

AP Assembly: జగన్ అసెంబ్లీకి వస్తారా.. డుమ్మా కొడతారా..!
YS Jagan

ఏపీ అసెంబ్లీ సమావేశాలు జూన్ 19న ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరుగుతోంది. ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారు. ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలతో ప్రోటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి 135 మంది, జనసేన నుంచి 21, వైసీపీ నుంచి 11 మంది, బీజేపీ నుంచి 9 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. టీడీపీ కూటమి నుంచి 164 మంది గెలిచారు. వైసీపీ నుంచి 11 మంది మాత్రమే విజయం సాధించారు. గత శాసనసభలో వైసీపీ నుంచి 151 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. ఈసారి ఆ సంఖ్య 11కు తగ్గిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి లభించలేదు. దీంతో శాసనసభలో వైసీపీ ఎమ్మెల్యేల వ్యవహరశైలి ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. వైసీపీ ఈ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ శాసనసభ సమావేశాలకు హాజరవుతారా లేదా అనేది చర్చ జరుగుతోంది. ఈనెల 19 నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో పాల్గొని అందరితో పాటు జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారా.. లేదా శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత స్పీకర్ ఛాంబర్‌లో బాధ్యతలు తీసుకుంటారా అనేది ఆసక్తి రేకెత్తిస్తోంది.

CM Chandrababu : టీడీపీ సారథిగా పల్లా శ్రీనివాసరావు


గత శాసనసభలో తమకు సంఖ్యాబలం ఉండటంతో వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాలను హేళనగా చూసింది. అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టింది. ప్రజా సమస్యలపై చర్చించడానికి అవకాశం కల్పించలేదు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి.. సభలో పలు రకాలుగా అవమానించారు. దీంతో తాను సీఎంగానే ఈ సభలో అడుగుపెడతానంటూ చంద్రబాబు నాయుడు సవాల్ చేశారు. ప్రస్తుతం చంద్రబాబు సీఎం హోదాలో శాసనసభలో అడుగుపెట్టబోతున్నారు. చంద్రబాబు నాయుడు సవాల్ చేసిన రోజు వైసీపీ ఎమ్మెల్యేలంతా ఎంతో ఎగతాళి చేశారు. మీరు ఇక శాసనసభకు రాలేరని వ్యాఖ్యానించారు. కానీ విధి రాత మరోలా ఉంది. వైసీపీ ఆశలు ఫలించలేదు. చంద్రబాబు నాయుడు సీఎంగా సభలో అడుగుపెట్టబోతున్నారు. దీంతో జగన్ శాసనసభ సమావేశాలకు హాజరై ప్రభుత్వానికి సహకరిస్తారా లేదా.. తొలిరోజు నుంచే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి ప్రభుత్వంపై విమర్శలను కొనసాగిస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో వైసీపీకి శాసనసభలో పెద్దగా ప్రాధాన్యత ఉండకపోవచ్చు. అయినప్పటికీ విపక్ష పార్టీల సలహాలు, సూచనలతో ముందుకెళ్తామని టీడీపీ నేతలు ప్రకటించారు. అయితే వైసీపీ అధినేత జగన్ మాత్రం శాసనసభ సమావేశాలకు దూరంగా ఉండాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.

Andhra Pradesh Assembly : స్పీకర్‌గా అయ్యన్న


జగన్ హాజరుపై..

ఈనెల 19 నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాలకు ఎమ్మెల్యేలంతా హాజరు కావాల్సి ఉంటుంది. దీంతో వైసీపీ నుంచి ఎన్నికైన 11మంది శాభకు హాజరై ప్రమాణం చేయాల్సి ఉంటుంది. అయితే జగన్ మినహా మిగతా వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జగన్ మాత్రం సమావేశాలు ముగిసిన తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. శాసనసభ సమావేశాల్లో వైసీపీ వైఖరి ఎలా ఉండబోతుంది. జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారనేదానిపై త్వరలోనే క్లారిటీ రానుంది.


Macharla Police: పిన్నెల్లి సోదరులపై రౌడీషీట్‌

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Jun 17 , 2024 | 11:19 AM