Share News

Anam Ramanarayana Reddy: వైసీపీ బ్రాండ్ కింద ఎమ్మెల్యేగా నేను పనిచేయలేను

ABN , Publish Date - Jan 23 , 2024 | 04:31 PM

వైసీపీ ( YCP ) బ్రాండ్ కింద ఎమ్మెల్యేగా తాను ఇక్కడ పనిచేయలేనని.. వెంకటగిరి అభివృద్ధి కోసం సీఎం జగన్‌కి లేఖలు ఇస్తే, ఏమయ్యాయో ఇంతవరకు తెలియదని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ( Anam Ramanarayana Reddy ) అన్నారు.

Anam Ramanarayana Reddy: వైసీపీ బ్రాండ్ కింద ఎమ్మెల్యేగా నేను పనిచేయలేను

ఉమ్మడి నెల్లూరు: వైసీపీ ( YCP ) బ్రాండ్ కింద ఎమ్మెల్యేగా తాను ఇక్కడ పనిచేయలేనని.. వెంకటగిరి అభివృద్ధి కోసం సీఎం జగన్‌కి లేఖలు ఇస్తే, ఏమయ్యాయో ఇంతవరకు తెలియదని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ( Anam Ramanarayana Reddy ) అన్నారు. తనను వైసీపీ నుంచి తొలగించారని.. ఎమ్మెల్యే పదవి నుంచి మాత్రం ఎవరూ తీయలేరని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా ఉండగానే ఒక అనధికార ప్రతినిధిని ఇక్కడ పెట్టారని. అందుకే సంవత్సర కాలంగా తాను వెంకటగిరి ప్రజలకు దూరంగా ఉన్నానని అన్నారు. మంగళవారం నాడు ఆనం రామనారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామాల్లోకి సక్రమంగా రావడం లేదని.. ప్రభుత్వ జాప్యంతో స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయని చెప్పారు.

తనపై వైసీపీ నేతలు చేసిన ఆరోపణలకి రాబోయే ఎన్నికల్లో ప్రజలే బుద్ది చెబుతారని హెచ్చరించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తనపై చేసిన ఆరోపణలని ఎవరూ నిరూపించలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఏదీ ఆదేశిస్తే అది చేస్తానని.. స్థానిక ఎమ్మెల్యేగా తనకు ఇవ్వాల్సిన గౌరవం ఆయన ఇస్తారని తెలిపారు. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల సంగ్రామంలో టీడీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వెంకటగిరి నియోజకవర్గంలో ఇచ్చిన ప్రతి హామీని తాము నిలబెట్టుకుంటామని ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.

Updated Date - Jan 23 , 2024 | 04:31 PM