Pinnelli: జైలు వద్ద పటిష్ట భద్రత
ABN , Publish Date - Aug 24 , 2024 | 09:23 AM
Andhrapradesh: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి ఈరోజు (శనివారం) విడుదలకానున్నారు. గత కొన్ని రోజులుగా రిమాండ్ ఖైదీగా పిన్నెల్లి ఉన్నారు. ఈక్రమంలో పిన్నెల్లికి పలు కండీషన్లపై హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈరోజు ఆయన బెయిల్‌పై జైలు నుంచి విడుదల అవనున్నారు.
నెల్లూరు, ఆగస్టు 24: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి ఈరోజు (శనివారం) విడుదలకానున్నారు. గత కొన్ని రోజులుగా రిమాండ్ ఖైదీగా పిన్నెల్లి ఉన్నారు. పిన్నెల్లికి పలు కండీషన్లపై హైకోర్టు(AP High Court) బెయిల్ మంజూరు చేసింది. ఈరోజు ఆయన బెయిల్‌పై జైలు నుంచి విడుదల అవనున్నారు. నిన్న సమయం మించిపోవడంతో నిబంధనల మేరకు జైలు అధికారులు విడుదల చేయలేదు. జైలు వద్దకు మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఇతర నేతలు చేరుకున్నారు.
Shikhar Dhawan: క్రికెట్‌కు వీడ్కోలు
పిన్నెల్లి విడుదల నేపథ్యంలో స్థానిక పోలీసులు జైలు వద్దకు చేరుకుంటున్నారు. నరసరావుపేట పోలీసు బృందాలు నిన్ననే నెల్లూరుకు చేరుకున్నారు. జైలు వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
Maternity Leaves: ఈ మహిళలకు ఏడాదిపాటు ప్రసూతి సెలవులు.. సీఎం కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల (AP Elections) సమయంలో మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయ్ గేటులో ఈవీఎం ధ్వంసం, పోలీసులపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. రెండు నెలలుగా నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్నారు. ఆగస్టు 23వ తేదీన (నిన్న) ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పిన్నెల్లి బెయిల్ మంజూరు చేసింది. పలుమార్లు బెయిల్ పిటిషన్లు దాఖలు చేయగా హైకోర్టు బెయిల్ ఇవ్వలేదు. శుక్రవారం మధ్యాహ్నం మాత్రం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 50 వేల రూపాయలతో రెండు పూచికత్తులు సమర్పించాలని పిన్నెల్లిని హైకోర్టు ఆదేశించింది.
ఇవి కూడా చదవండి...
Nagarjuna: నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత..
KTR : కేటీఆర్ వ్యాఖ్యలు.. రాజుకున్న వివాదం.. మహిళ కమిషన్ ముందుకు కేటీఆర్
Read Latest AP News And Telugu News