Share News

MLA Mahidhar Reddy: సీఎం జగన్ దూతలపై ఎమ్మెల్యే‌ మహిధర్‌రెడ్డి సీరియస్

ABN , Publish Date - Jan 04 , 2024 | 11:48 PM

సీఎం జగన్ ( CM JAGAN ) దూతలపై కందుకూరు వైసీపీ ఎమ్మెల్యే‌ మహిధర్‌రెడ్డి ( Mahidhar Reddy ) సీరియస్ అయ్యారు. గురువారం నాడు తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహిధర్‌రెడ్డికి కందుకూరు టికెట్ ఇవ్వాలంటే చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌ని తిట్టాలని సీఎం జగన్ కండీషన్ పెట్టారని చెప్పారు.

MLA Mahidhar Reddy: సీఎం జగన్ దూతలపై ఎమ్మెల్యే‌ మహిధర్‌రెడ్డి సీరియస్

నెల్లూరు : సీఎం జగన్ ( CM JAGAN ) దూతలపై కందుకూరు వైసీపీ ఎమ్మెల్యే‌ మహిధర్‌రెడ్డి ( Mahidhar Reddy ) సీరియస్ అయ్యారు. గురువారం నాడు తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహిధర్‌రెడ్డికి కందుకూరు టికెట్ ఇవ్వాలంటే చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌ని తిట్టాలని సీఎం జగన్ కండీషన్ పెట్టారని చెప్పారు. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ద్వారా మహిదర్‌కి సీఎం జగన్ సందేశం పంపారన్నారు. ఈరోజు మరోసారి మహిధర్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఐప్యాక్ టీం సభ్యులు, వైసీపీ నాయకులు చెప్పారన్నారు. జగన్ తీరుపై ఎమ్మెల్యే మహిధర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలను తిట్టడం ద్వారా వచ్చే సీటు తనకి అవసరం లేదని ఎమ్మెల్యే మహిధర్‌రెడ్డి తేల్చిచెప్పారు.

Updated Date - Jan 04 , 2024 | 11:49 PM