Pawan Kalyan: లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు.. పవన్ కల్యాణ్ వార్నింగ్
ABN , Publish Date - Nov 09 , 2024 | 09:01 AM
ఏపీలో జరుగుతున్న లైంగిక వేధింపులపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కఠిన చర్యలు తీసుకుంటున్న నేరస్తుల్లో మార్పు రావడం లేదని పవన్ కల్యాణ్ అన్నారు.
అమరావతి: లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హెచ్చరించారు. నెల్లూరు, వెంకటేశ్వరపురం, భగత్ సింగ్ కాలనీలోని టిడ్కో అపార్ట్మెంట్‌లో నివసించే 13 ఏళ్ల మైనర్ బాలిక, 45 ఏళ్ల మహిళపై ఆలీ అనే వ్యక్తి లైంగికంగా దాడి చేసి బెదిరించాడు. ఈ ఘటనపై పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ మేరకు (ఎక్స్) ట్విట్టర్‌లో పవన్ కళ్యాణ్ పలు కీలక విషయాలపై స్పందించారు.
జరిగిన ఘటన చాలా దారుణమని అన్నారు. బాధితులు, స్థానికులు భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు జనసేన పక్షాన, ప్రభుత్వం పరంగా తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాంటి పరిస్థితులను నివారించేలా ఎలా ఎదుర్కోవాలి, సహాయం ఎలా తీసుకోవాలో తాను పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడతానని పవన్ కల్యాణ్ చెప్పారు.
జగన్ ప్రభుత్వం సహజ వనరులను దోచుకుంది..
ప్రతి ఒక్కరూ ఇలాంటి దారుణాలపై తిరిగి సమాధానం చెప్పేలా అవగాహన పెంచుకోవాలని సూచించారు. అలాగే ఐ.ఎస్.జగన్నాథపురంలో అనుమతి లేని ప్రదేశంలో తవ్వకాలపై పవన్ కల్యాణ్ స్పందించారు. జగన్ ప్రభుత్వం సహజ వనరులను దోచుకుందని ఆరోపించారు. ఈ ఘటనకు బాధ్యులైన వ్యక్తులు, ఇన్‌ఫ్రా కంపెనీ, ప్రభుత్వ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఏపీలో డ్రగ్స్ పెనుముప్పుగా మారింది..
ఏపీలో డ్రగ్స్ పెనుముప్పుగా మారిందని పవన్ కల్యాణ్ అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి వైసీపీ అవినీతి, నేర పాలన నుంచి సంక్రమించిన మరొక వారసత్వ సమస్య ఇది అని విమర్శించారు. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా, గంజాయి సాగు, సంబంధిత నేర కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. కొంతకాలం క్రితం, విశాఖపట్నం ఓడరేవులో కొకైన్ షిప్‌మెంట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో పట్టుబడిన డ్రగ్స్‌కు విజయవాడలోని ఒక వ్యాపార సంస్థతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. జగన్ పాలనలో డ్రగ్ మాఫియా బాగా అభివృద్ధి చెందిందని విమర్శలు చేశారు. ఈ నేరగాళ్లను కట్టడి చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అవసరమని పవన్ కల్యాణ్ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Borugadda Anil: పోలీసుల అదుపులో బోరుగడ్డ అనిల్
Supreme Court: పుణ్య క్షేత్రాలను ప్రత్యేక రాష్ట్రాలు చేయాలా?
Read Latest AP News And Telugu News