Share News

Pawan Kalyan: అలా చేస్తే కూటమి ప్రభుత్వానికే ఇబ్బంది.. పవన్ కళ్యాణ్ హెచ్చరిక

ABN , Publish Date - Jul 23 , 2024 | 02:46 PM

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళవారం శాసనసభలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో కూడా అమరావతినే రాజధాని ఉండే విధంగా..

Pawan Kalyan: అలా చేస్తే కూటమి ప్రభుత్వానికే ఇబ్బంది.. పవన్ కళ్యాణ్ హెచ్చరిక
Pawan Kalyan

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మంగళవారం శాసనసభలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో కూడా అమరావతినే రాజధాని ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అందుకు ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) నాయకత్వంలో మరింత ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. తనకు ప్రత్యర్థి అయినప్పటికీ వైఎస్ రాజశేఖరరెడ్డి (YS Rajasekhar Reddy) చేసిన మంచి పనులను పొగిడారని, అదీ చంద్రబాబు వ్యక్తిత్వమని కొనియాడారు. రాజకీయాల్లో ఆయనకు ఉన్న సుదీర్ఘ అనుభవంతో.. మాబోటి వాళ్ళు కూడా నేర్చుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. ఆయన పాలన ఈ రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.


ఇదే సమయంలో.. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం రూ.15 వేల కోట్లు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు.. కూటమి పక్ష నేతలు, కార్యకర్తలు ఓ హెచ్చరిక జారీ చేశారు. ఎవరైనా తప్పులు చేస్తే.. అది కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందని అన్నారు. చివరికి జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలైనా సరే.. తప్పు చేస్తే వారిని వదులుకోవడానికి కూడా తాను వెనుకాడనని తెగేసి చెప్పారు. ఎవరు తప్పు చేసినా తాము శిక్ష వేస్తామనే సంకేతం ప్రజలకు వెళ్లాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. చంద్రబాబు అనుభవం ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుందని.. అందుకు తాము తప్పనిసరిగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అటు.. గత వైసీపీ పాలనపై కూడా నిప్పులు చెరిగారు. పంచాయితీలకు కేంద్రం సకాలంలో నిధులిచ్చినా.. గత ప్రభుత్వం వాటిని బదలాయించలేదని ఆరోపించారు. నిధుల బదలాయింపులో జరిగిన అవకతవకలపై కమిషన్ వేస్తామని అన్నారు.


అమరావతికి రూ.15 వేల కోట్లు

కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో భాగంగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని, విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సహకారం అందించనున్నామన్న ఆమె.. 2024-25 బడ్జెట్‌లో ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15వేల కోట్ల నిధులు కేటాయించనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి, పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేక రాయితీలూ ఇస్తామన్నారు. విశాఖ-చెన్నై ఇండస్ట్రీయల్ కారిడర్ అభివృద్ధికి.. రాయలసీమ, ప్రకాశం జిల్లా, ఉత్తరాంధ్రకు నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు.

Read Latest Andhra Pradesh News and Telugu News

Updated Date - Jul 23 , 2024 | 02:46 PM