Budget 2024: వేతన జీవులకు శుభవార్త.. కొత్త పన్ను స్లాబ్స్ ప్రకటన
ABN , Publish Date - Jul 23 , 2024 | 01:23 PM
2024-25 సాధారణ బడ్జెట్(budget 2024)ను సమర్పిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(nirmala sitharaman) కొత్త పన్ను శ్లాబ్(new tax regime slabs) విధానాన్ని ప్రకటించారు. దీంతో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు సున్నా నుంచి 3 లక్షల రూపాయల వరకు ఉన్న ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
2024-25 సాధారణ బడ్జెట్(budget 2024)ను సమర్పిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(nirmala sitharaman) కొత్త పన్ను శ్లాబ్(new tax regime slabs) విధానాన్ని ప్రకటించారు. దీంతో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు సున్నా నుంచి 3 లక్షల రూపాయల వరకు ఉన్న ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
ఆ తర్వాత 3 లక్షల రూపాయల నుంచి రూ.7 లక్షల ఆదాయంపై 5%, రూ. 7 లక్షల నుంచి రూ. 10 లక్షల ఆదాయంపై 10%, రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షల ఆదాయంపై 15% పన్ను విధిస్తారు. ఇక 12 లక్షల నుంచి రూ. 15 లక్షల మధ్య ఆదాయంపై 20% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రూ. 15 లక్షల కంటే ఎక్కువ ఆదాయంపై 30% ఆదాయపు పన్ను చెల్లించాలి.
స్లాబ్‌లో మార్పు
ఈ స్టాండర్డ్ డిడక్షన్‌ను పెంచుతున్నట్లు ప్రకటించడం వల్ల కొత్త పన్ను విధానంలో పన్ను చెల్లించే ఏ పన్ను చెల్లింపుదారుకైనా పన్ను విధించదగిన ఆదాయం రూ. 25,000 తగ్గుతుంది. దీని ఫలితంగా ఆరోగ్యం, విద్య సెస్‌తో సహా రూ. 1,300 ఆదాయపు పన్ను తగ్గుతుంది. ఇది కాకుండా స్లాబ్‌లో మార్పు కారణంగా, పన్ను చెల్లింపుదారులు లక్ష ఆదాయంపై 10% బదులుగా 5% ఆదాయపు పన్ను చెల్లించాలి. దీని కారణంగా వారు ఆరోగ్యం, విద్య సెస్‌తో సహా రూ. 5,200 తక్కువ ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
వీరికి మరింత ప్రయోజనం
అలాగే పన్ను చెల్లించదగిన ఆదాయం రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న పన్ను చెల్లింపుదారులు రూ. 6,500తో పాటు రూ. 5,200 ప్రయోజనం పొందుతారు. వాస్తవానికి పన్ను స్లాబ్‌లలో మార్పు కారణంగా ఇప్పుడు రూ. 7 లక్షల నుంచి 10 లక్షల మధ్య ఆదాయంపై 10% మాత్రమే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు రూ. 9 లక్షల కంటే ఎక్కువ ఆదాయంపై 15% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి కనీసం 1 లక్ష ఆదాయంపై 5% తక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీని కారణంగా పన్ను చెల్లించదగిన ఆదాయం రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న పన్ను చెల్లింపుదారులకు రూ. 5,200 అదనపు ప్రయోజనం లభిస్తుంది.
అదే సమయంలో కొన్ని ఆస్తులపై షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కూడా 20 శాతానికి తగ్గించబడింది. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌కు సంబంధించిన ప్రకటన ప్రభావం స్టాక్ మార్కెట్‌పై కనిపించింది. కొత్త పన్ను శ్లాబ్‌లో మార్పులు చేశామని, పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పు లేదని ఆర్థిక మంత్రి తెలిపారు.
ఇవి కూడా చదవండి:
Gold and Silver Rates: బడ్జెట్ వేళ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Union Budget 2024: విద్యార్థులకు గుడ్ న్యూస్.. 10 లక్షల వరకు లోన్స్
Budget 2024: బడ్జెట్ 2024లో ముద్ర లోన్స్ రుణ పరిమితి రూ.20 లక్షలకు పెంపు
Budget 2024-25: బడ్జెట్ 2024-25ను సమర్పించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
Stock Market: బడ్జెట్ ఎఫెక్ట్.. ఆ షేర్లన్నీ ఢమాల్..
Read More Business News and Latest Telugu News