Share News

Gottipati Ravi Kumar: వ్యవసాయం, ఆక్వా రంగాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుంది

ABN , Publish Date - Nov 05 , 2024 | 02:10 PM

వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా గుంతల రోడ్లే దర్శనం ఇస్తున్నాయని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మండిపడ్డారు. యుద్ధ ప్రాతిపదికన గుంతలు పూడ్చాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని అన్నారు.

Gottipati Ravi Kumar: వ్యవసాయం, ఆక్వా రంగాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుంది

బాపట్ల జిల్లా: బాపట్ల జిల్లాలో టూరిజాన్ని ప్రోత్సహించి, యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ హామీ ఇచ్చారు. బాపట్ల జిల్లాలో మంత్రులు గొట్టిపాటి రవి కుమార్, ఇన్‌చార్జ్ మంత్రి కొలుసు పార్ధసారధి పర్యటించారు. కర్లపాలెం మండలం యాజీలి వద్ద మంత్రులు రోడ్డు గుంతలు పూడ్చారు.


ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మీడియాతో మాట్లాడుతూ.... వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా గుంతల రోడ్లే దర్శనం ఇస్తున్నాయని మండిపడ్డారు. యుద్ధ ప్రాతిపదికన గుంతలు పూడ్చాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని అన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.826 కోట్లు కేటాయించిందన్నారు. నెల రోజుల్లో ప్రయాణికులకు ఇబ్బంది లేని రోడ్లను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. సూపర్ సిక్స్ హామీల అమల్లో భాగంగా దీపం పథకం-2ను ప్రారంభించినట్లు తెలిపారు. బాపట్ల జిల్లాలో వ్యవసాయం, ఆక్వా రంగాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు.


న‌దుల అనుసంధాన ప్రాజెక్టుల‌పై మంత్రి నిమ్మల రామానాయుడు చర్చ...

nimmala-ramanaidu.jpg

ప్రాధన్యతా ప్రాజెక్టుల ప‌నులు నవంబ‌ర్ నెల నుంచే ప్రారంభం కావాల‌ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఆదేశించిన విషయం తెలిసిందే. సీఎం ఆదేశాలను అమలు చేసేందుకు మంత్రి నిమ్మల రామానాయుడు వరుస సమీక్షలు నిర్వహించారు. పోల‌వ‌రం, వెలిగొండ‌, చింత‌ల‌పూడి, గోదావ‌రి-పెన్నా న‌దుల అనుసంధాన ప్రాజెక్టుల‌పై ఇరిగేష‌న్ ఉన్నతాధికారులు, ఏజెన్సీలతో విజ‌య‌వాడ క్యాంపు కార్యాల‌యంలో స‌మీక్ష జరిపారు.


ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, ఆయా ప్రాజెక్టుల సీఈలు, ఎస్ఈలు, మేఘా ఇంజ‌నీరింగ్ ఏజెన్సీ ఈ సమావేశానికి హాజరయ్యారు. రేప‌టి (బుధవారం) నుంచి పోల‌వ‌రం ఢ‌యా ఫ్రం వాల్, ఈసీఆర్ఎఫ్ నిర్మాణానికి సంబంధించి నిపుణుల‌తో వ‌ర్క్ షాప్ నిర్వహణపై సమావేశంలో చర్చించనున్నారు. వెలిగొండ ప్రాజెక్టులో జగన్ ప్రభుత్వం చేసిన వైఫ‌ల్యాల‌ను, దెబ్బతిన్న ఫీడ‌ర్ కెనాల్‌పై స‌మ‌గ్ర రిపోర్టును తయారు చేసి సీఎం చంద్రబాబు నాయుడికి మంత్రి నిమ్మల రామానాయుడు అందివ్వనున్నారు.


ఇవి కూడా చదవండి..

Nimmala: ప్రాజెక్టులపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష

AP HighCourt: ఆంధ్రజ్యోతి విలేఖరి హత్య కేసు.. హైకోర్టులో వైసీపీ నేతకు షాక్

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 05 , 2024 | 02:38 PM