AP Election 2024: పులివెందుల టీడీపీ అభ్యర్థికి భద్రత లేదు.. ఈసీకి కనకమేడల రవీంద్ర లేఖ
ABN , Publish Date - Apr 11 , 2024 | 06:15 PM
ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా వైసీపీ (YSRCP) నేతలు యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) పలుమార్లు ఏపీ ఎన్నికల సంఘం (Election Commission) దృషికి తీసుకెళ్తుంది.
అమరావతి: ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా వైసీపీ (YSRCP) నేతలు యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) పలుమార్లు ఏపీ ఎన్నికల సంఘం (Election Commission) దృషికి తీసుకెళ్లింది. ఈ విషయంపై ఏపీ ఎన్నికల అధికారులకు పలుమార్లు టీడీపీ నేతలు ఫిర్యాదు చేసిన తూతూమంత్రపు చర్యలను మాత్రమే తీసుకుంటున్నారు. ప్రతిపక్షాలపై అధికార వైసీపీ దాడులకు ఉసిగోల్పుతోందని.. ఇలాంటి దాడులు ఏపీలో రోజురోజుకూ పెరిగి పోతున్నాయని టీడీపీ నేతలు మరోసారి కేంద్ర ఎన్నికల సంఘానికి గురువారం నాడు ఫిర్యాదు చేశారు.
Lokesh: కోయంబత్తూరుకు బయలుదేరిన నారా లోకేష్.. విషయం ఇదే!
పులివెందుల అసెంబ్లీపై ప్రత్యేక దృష్టిసారించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర (Kanakamedala Ravindra) లేఖ రాశారు. శాంతియుత ఎన్నికల నిర్వహణకు తగు చర్యలు తీసుకోవాలని ఈసీఐ ఆదేశించినా కొంతమంది అధికారులు మాత్రం అధికార పార్టీ ఒత్తిడితో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పులివెందులలో జగన్ రెడ్డిపై పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి బీటెక్ రవికి భద్రత లేదని అన్నారు. ఈ నియోజకవర్గంలో తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ గతంలోనే ఈసీఐకి తాము లేఖ రాశామని గుర్తు చేశారు.
పులివెందుల చినచౌక్, రూరల్ ఇన్‌స్పెక్టర్ అశోక్ రెడ్డి గత ఐదేళ్లుగా ఒకే స్థానంలో పనిచేస్తున్నారని చెప్పారు. కానీ జిల్లా ఎస్పీ ఈ విషయంలో అధికార పార్టీకి సహకరిస్తున్నారన్నారు. వెంటనే సదరు ఎస్పీపై చర్యలు తీసుకోవాలని కోరారు. అధికార పార్టీకి కొంతమంది నేతలు అనుకూలంగా వ్యవహారిస్తున్నారని చెప్పారు. ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయించిన అశోక్ రెడ్డిని వెంటనే బదిలీ చేసి, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పెంచాలని లేఖలో కనకమేడల కోరారు.
జగన్ రెడ్డిపై పోటీ చేస్తున్న బీటెక్ రవికి ఎలాంటి ప్రాణహాని లేదని స్థానిక ఎస్సీ చెప్పడం అబ్బద్ధమని అన్నారు. రవికి భద్రత కల్పించే విషయంలో ఎన్నికల అధికారులైన డీఈఓ, సీఈఓలు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్పారు. ఇది ఎన్నికల అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల ఎంపికలో పోటీ చేస్తున్న అభ్యర్థులను ఎన్నికల అధికారులు, పోలీసులు సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని ఈసీఐ చాలా స్పష్టంగా చెప్పిందని గుర్తుచేశారు. కానీ స్థానిక ఎస్పీ పులివెందులలోని మొత్తం 68 కేంద్రాల్లో కేవలం 32 మాత్రమే సమస్యాత్మక కేంద్రాలని ఏకపక్షంగా నిర్ణయించారని మండిపడ్డారు. ఎస్పీ నిర్ణయించిన కేంద్రాల్లోనే డీఈఓ ఫైనల్ చేసి ఏపీ సీఈఓకు పంపారని అన్నారు.
Varla Ramaiah: ఆ ఇద్దరి చేతగానితనం వల్లే పోలీసులకు ఈ దుస్థితి
పులివెందుల డెవలప్మెంట్ అథారిటీ (PADA) ఓఎస్‌డీ అనిల్ కుమార్ రెడ్డి వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. అనిల్ కుమార్ రెడ్డి అధికార పార్టీకి అనుకూలంగా పనిచేసినందుకు సీఎం జగన్ ఆశీస్సులతో ఇటీవల ఐఏఎస్ క్యాడర్ పొందారని.. ఈ విషయంపై కూడా విచారించాలని కోరారు. పాడా ఆఫీస్‌ను ఇటీవల పులివెందుల రిటర్నింగ్ అధికారి ఆఫీసుకు ప్రక్కనే ఉన్న మినీ సెక్రటరీయట్‌కు మార్చారని అన్నారు. వైసీపీ ఎన్నికల కార్యకలాపాలను పర్యవేక్షించడానికి PADA ఆఫీసును ఎన్నికల ఆఫీసు దగ్గరకు మార్చారని చెప్పారు.
అయినప్పటికీ ఈ విషయంపై జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ (డీఈఓ) ఎలాంటి అభ్యంతరం ఎందుకు వ్యక్తం చేయట్లేదని ప్రశ్నించారు. పైన పేర్కొన్న విషయాలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టితో బీటెక్ రవికి వెంటకే భద్రత కల్పించాలని కోరారు. స్పెషల్ పోలీస్ పర్యవేక్షకుడి ద్వారా పులివెందులలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. పోలీసులతో సమానంగా ఒక వ్యవస్థనే నడిపిస్తున్న అశోక్ రెడ్డిని వెంటనే వేరే ప్రాంతానికి బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కనకమేడల రవీంద్ర కోరారు.
ఇవి కూడా చదవండి
YS Sharmila: మోసానికే బ్రాండ్ అంబాసిడర్ జగన్.. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పగలరా?
Inter Results: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపే ఇంటర్ రిజల్ట్స్.. పూర్తి వివరాలివే..