AP Elections: షర్మిలపై వైసీపీ ఎమ్మెల్యే సెన్సేషనల్ కామెంట్స్.. ఏమన్నారో తెలుసా..
ABN , Publish Date - Apr 12 , 2024 | 03:34 PM
విలువ లేని పార్టీలో ఇమడలేకే కాంగ్రెస్ ( Congress ) పార్టీలోకి చేరినట్లు పూతలపట్లు వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు అన్నారు. రాజకీయ భవిష్యత్ ప్రారంభమైన కాంగ్రెస్ పార్టీలోకి మళ్లీ చేరడం ఆనందంగా ఉందన్నారు. ఎ
విలువ లేని పార్టీలో ఇమడలేకే కాంగ్రెస్ ( Congress ) పార్టీలోకి చేరినట్లు పూతలపట్లు వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు అన్నారు. రాజకీయ భవిష్యత్ ప్రారంభమైన కాంగ్రెస్ పార్టీలోకి మళ్లీ చేరడం ఆనందంగా ఉందన్నారు. ఎమ్మెల్యేగా బాగా పని చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్లు చెప్పారు. అయినప్పటికీ అధిష్టానం గుర్తించకపోవడం చాలా బాధాకరమని వాపోయారు. గతంలో పార్టీకి ద్రోహం చేసిన వారిని ఈరోజు పక్కన కూర్చుని పెట్టి టికెట్ ఇవ్వడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. పూతలపుట్టులో నిర్వహించిన సిద్ధం సభకు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అయిన తనకు ఆహ్వానం రాకపోవడం కలచివేసిందని వాపోయారు.
YS Sharmila: ఇవాళ పులివెందులలో షర్మిల ప్రచారం.. సర్వత్రా ఉత్కంఠ..
రాబోయే రోజుల్లో వైఎస్. షర్మిలను ముఖ్యమంత్రిని చేయడమే తమ ధ్వేయమని ఎమ్మెస్ బాబు అన్నారు. పూతలపట్టు నియోజకవర్గంలో తన సత్తా చూపిస్తానని వైసీపీకి సవాల్ విసిరారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పూర్తి సహకారం అందుతుందని తెలిపారు. బంగారు పాళ్యంలో ఈనెల 15వ తేదీన పీసీసీ అధ్యక్షురాలు షర్మిల బస్సు యాత్ర ఉంటుందని ఎమ్మెస్ బాబు వెల్లడించారు.
AP Elections: ఎంపీగా పోటీ చేయడానికి కారణం అదే.. మరో బాంబు పేల్చిన షర్మిల..
కాగా.. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేశారు. ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. పూతలపట్టులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఎంఎస్ బాబుకు వైఎస్సార్‌సీపీ సీటు కేటాయించలేదు. ఆయనకు బదులుగా మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్‌కు టికెట్ ఇచ్చారు.. దీంతో ఎంఎస్ బాబు వైసీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.