Share News

President Rule: ఢిల్లీ ప్రభుత్వాన్ని పడగొట్టే యత్నం.. రాష్ట్రపతి పాలన విధించేందుకు పన్నాగం

ABN , Publish Date - Apr 12 , 2024 | 03:10 PM

లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కావడంతో రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. ఢిల్లీలో తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ చూస్తోందని మంత్రి ఆతిషి సంచలన ఆరోపణలు చేశారు. దీంతో బీజేపీ నేతలు, ఆప్ మంత్రులు మధ్య మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరింది.

President Rule: ఢిల్లీ ప్రభుత్వాన్ని పడగొట్టే యత్నం.. రాష్ట్రపతి పాలన విధించేందుకు పన్నాగం
Plot Hatched To Impose President's Rule In Delhi: Minister Atishi

ఢిల్లీ: లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అరెస్ట్ కావడంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. బీజేపీ (BJP) నేతలు, ఆప్ మంత్రుల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఢిల్లీలో ఆప్ (AAP) ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ చూస్తోందని మంత్రి ఆతిషి సంచలన ఆరోపణలు చేశారు.

Delhi: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించిన మనీష్ సిసోడియా


అధికారుల గైర్హాజరు

‘ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం నిర్వహించే సమావేశాలకు అధికారులు హాజరు కావడం లేదు. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో గల ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నంలో బీజేపీ ఉంది. రాష్ట్రపతి పాలన విధించాలని అనుకుంటోంది. రాష్ట్రపతి పాలన విధించాలని అనుకోవడం చట్ట విరుద్దం, రాజ్యాంగ విరుద్దం అని’ మంత్రి ఆతిషి మండిపడ్డారు. ప్రజల తీర్పుకు విరుద్దంగా ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించాలని చూడటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Bangalore: ఎన్నికలవేళ కాంగ్రెస్‏కు బిగ్ షాక్‌.. పార్టీకి సీఎం ఆప్తుడు గుడ్‌బై


కేజ్రీవాల్ సెక్రటరీ తొలగింపు

సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రైవేట్ సెక్రటరీ బిభవ్ కుమార్‌ను విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ విధుల నుంచి తొలగించింది. కుమార్ నియామకం చట్ట విరుద్దమైందని ప్రకటించి విధుల నుంచి తప్పించింది. ఆ మరుసటి రోజు ఆతిషి మీడియా ముందుకు వచ్చి బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో అధికారులను నియమించడం లేదు. బదిలీలు, పోస్టింగులు లేవు. గత కొన్నిరోజుల నుంచి లెప్టినెంట్ గవర్నర్ ఎంహెచ్‌ఏకు నిరాధార లేఖలు రాస్తున్నారు. ఇవన్నీ ప్లాన్ చేసినట్టుగా ఉన్నాయి. జరుగుతున్న పరిణామాలు ప్లాన్ చేసినట్టుగా ఉన్నాయి. ఢిల్లీలో తమ ప్రభుత్వాన్ని కూల్చి, రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ కుట్ర చేస్తుందని మంత్రి ఆతిషి మండిపడ్డారు.

Bengaluru: రామేశ్వరం కేఫ్‌లో పేలుడు: సూత్రధారులు అరెస్ట్

మరిన్ని జాతీయ వార్తల కోసం

Updated Date - Apr 12 , 2024 | 03:10 PM