Share News

Kanakamedala Ravindra Kumar: రాయి ఘటనకు వ్యూహకర్త ఆయనే..

ABN , Publish Date - Apr 15 , 2024 | 02:04 PM

రెండు రోజుల నుంచి ఏపీలో రాజకీయ క్రీడలు జరుగుతున్నాయని టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు. నేడు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాుడూత.. ఏపీ సీఎం జగన్‌పై దాడి ఒక డ్రామా అని అన్నారు. ఏపీలో ప్రజలను పక్కదారి పట్టించే విధంగా సాక్షి రాతలు ఉన్నాయన్నారు. రాయి ఘటనకు వ్యూహకర్త సజ్జల అని పేర్కొన్నారు. మాటువేసి మట్టుబెట్టే కుట్ర చేస్తున్నారని సాక్షిలో రాసుకున్నారన్నారు.

Kanakamedala Ravindra Kumar: రాయి ఘటనకు వ్యూహకర్త ఆయనే..

ఢిల్లీ: రెండు రోజుల నుంచి ఏపీలో రాజకీయ క్రీడలు జరుగుతున్నాయని టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు. నేడు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం జగన్‌ (CM Jagan)పై దాడి ఒక డ్రామా అని అన్నారు. ఏపీలో ప్రజలను పక్కదారి పట్టించే విధంగా సాక్షి రాతలు ఉన్నాయన్నారు. రాయి ఘటనకు వ్యూహకర్త సజ్జల అని పేర్కొన్నారు. మాటువేసి మట్టుబెట్టే కుట్ర చేస్తున్నారని సాక్షిలో రాసుకున్నారన్నారు. వైసీపీ నేత ఔతూ శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్రంలో నాలుగు రోజుల్లో సంచలనం సృష్టించే న్యూస్ ఉంటుంది అని సోషల్ మీడియాలో పెట్టారని కనకమేడల తెలిపారు.

BJP: ఏపీలో వింత వింత సంఘటనలు: భానుప్రకాశ్ రెడ్డి


‘‘గతంలో శ్రీధర్ రెడ్డి అనే అతను జడ్జీలను సైతం బెదిరించారు. జడ్జీలను తిడుతూ పెట్టిన పోస్టుపై చర్యలు తీసుకోవాలని సీబీఐని ఏపీ హైకోర్టు ఆదేశించింది. సంచలనం ముందే తెలుసా ? సీఎం పర్యటనలో మనుషులనే కాదు చెట్లనూ నరికేశారు.14 వ తేదీన సీఎం భద్రతను గాలికి వదిలేశారు? సీఎంపై రాయి ఘటన తర్వాత సాక్షిలో కథనం రాయడం దానికి మంత్రులు గగ్గోలు పెట్టడం రోడ్ల పైకి వచ్చి ఆందోళన చేశారు. విజయవాడలో సీఎం పర్యటన అంటే నాలుగు గంటల ముందు ట్రాఫిక్ బంద్ చేస్తారు’’ అని కనకమేల అన్నారు.

Gorantla Butchaiah Chowdary: కరెంట్ తీయటం జగన్ కుట్ర కాదా?


‘‘ప్రజలు నరకం చూస్తున్నారు. సీఎం పై దాడి పై పోలీసులు సమాధానం చెప్పాలి. జగన్ ఉద్దేశ్యాన్ని గ్రహించలేదా పోలీసులు? రాయి ఘటన జరిగిన రాత్రి కరెంట్ తీసేశారు. డీజీపీ, సీపీ ఎవరు ఆదేశాలు ఇచ్చారు. పోలీసులు ఏం చేస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు కుట్ర అన్నారు. జగన్‌‌కు వెళ్లంపల్లికి అదే రాయి తగిలింది. సీఎం ను హత్య చేయడానికి రాయి తీసుకొని వేస్తారా?’’ అని కనకమేడల రవీంద్ర కుమార్ ప్రశ్నించారు.

Sunitha Reddy: తండ్రి హత్యోదంతాన్ని వివరిస్తూ భావోద్వేగానికి గురైన సునీతా రెడ్డి

మరిన్ని ఏపీ వార్తల కోసం..

Updated Date - Apr 15 , 2024 | 02:05 PM