Duvvada: బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.. తుపాకీకి లైసెన్స్ ఇవ్వండి
ABN , Publish Date - Aug 09 , 2024 | 11:44 AM
Andhrapradesh: శ్రీకాకుళం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తుపాకీ లైసెన్స్‌కు దరఖాస్తు చేశారు. తన దగ్గర తుపాకీ ఉందని.. దానికి లైసెన్స్ ఇవ్వాలని కోరుతూ ఎస్పీ మహేందర్ రెడ్డికి ఈనెల 7న దువ్వాడ దరఖాస్తు చేసుకున్నారు. తనకు కొంత మంది వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపారు.
శ్రీకాకుళం, ఆగస్టు 9: శ్రీకాకుళం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (YSRCP MLC Duvvada Srinivas) తుపాకీ లైసెన్స్‌కు దరఖాస్తు చేశారు. తన దగ్గర తుపాకీ ఉందని.. దానికి లైసెన్స్ ఇవ్వాలని కోరుతూ ఎస్పీ మహేందర్ రెడ్డికి ఈనెల 7న దువ్వాడ దరఖాస్తు చేసుకున్నారు. తనకు కొంత మంది వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపారు. అలాగే కొంత మంది తన ఇంటి వద్ద అనుమానంగా రెక్కీ నిర్వహిస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
Paris Olympics: ఇతని వ్యక్తిత్వం ముందు ఒలింపిక్ పతకం చిన్నబోయింది..!
ఈ క్రమంలో తన వద్ద ఉన్న తుపాకీకి లైసెన్స్ మంజూరు చేయాలని కోరారు. ఇదే విషయమై జులైలో కూడా టెక్కలి పోలీసులకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. గుర్తు తెలియని నెంబర్ నుంచి తనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని టెక్కలి సీఐకు తెలిపారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. నిందితుల నుంచి తనకు ప్రాణ హానీ ఉందని... కావు 4+4 గన్‌మెన్లను కేటాయించాలని ప్రభుత్వానికి కూడా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వినతి చేసిన సంగతి తెలిసిందే.
Telugu Desam: ఇద్దరు కార్యకర్తలకు అరుదైన గౌరవం.. సచివాలయానికి ప్రత్యేకంగా పిలిపించుకున్న సీబీఎన్
కుటుంబంలో వివాదాలు....
కాగా.. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం రచ్చకెక్కింది. గురువారం రాత్రి ఆయన ఇంటిముందు కుమార్తెలు నిరసనకు దిగారు. తమ తండ్రి బయటకు రావాలంటూ మౌనపోరాటానికి దిగారు. ఎన్నికలకు ఏడాది ముందు దువ్వాడ శ్రీను కుటుంబ వివాదాలు బయటపడ్డాయి. కొన్నాళ్ల కిందట దువ్వాడ శ్రీను అక్కవరం వద్ద ఇంటిని నిర్మించుకున్నారు. అక్కడ మరో మహిళతో కలసి ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. దువ్వాడ శ్రీను-వాణికి హైందవి, నవీన అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల శ్రీను మరో మహిళతో ఉంటుండటంతో తమ సంగతేమిటో తేల్చాలంటూ కుమార్తెలు నిన్న రాత్రి ఆందోళన నిర్వహించారు. దువ్వాడ శ్రీను ఇంటి ముందే కుమార్తెలు కారులో కూర్చుని చాలాసేపు ఉన్నారు. బయటి నుంచి పిలిచినప్పటికీ సిబ్బంది గేటు తీయలేదు. దువ్వాడ కుటుంబంలో చాన్నాళ్ల నుంచి వివాదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్నా.. తాజాగా అవి బయటపడ్డాయి. కుమార్తెలు అక్కడే విలేకరులతో మాట్లాడుతూ.. తమ తల్లిదండ్రులకు చట్టపరంగా విడాకులు కాలేదని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Duvvada Srinivas : భగ్గుమన్న వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ వివాదం
Lokesh: ప్రజాదర్బార్‌లో మంత్రి లోకేష్‌ను కలిసిన అనంత ఏఎస్పీ బాధితురాలు
Read Latest AP News And Telugu News