Share News

AP Politics: ఆనాడు సవాల్ స్వీకరించలే: అనిల్ కుమార్

ABN , Publish Date - Jun 13 , 2024 | 03:33 PM

ఎన్నికల సమయంలో మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన ఛాలెంజ్ గురించి ప్రస్తావించారు. పల్నాడులో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని సవాల్ చేశారు. ఆ విషయాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రస్తావిస్తున్నాయి. దీంతో అనిల్ కుమార్ యాదవ్ మీడియా ముందుకు వచ్చారు.

AP Politics: ఆనాడు సవాల్ స్వీకరించలే: అనిల్ కుమార్
Anil Kumar Yadav

అమరావతి: ఎన్నికల సమయంలో మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) చేసిన ఛాలెంజ్ గురించి ప్రస్తావించారు. పల్నాడులో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని సవాల్ చేశారు. ఆ విషయాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రస్తావిస్తున్నాయి. దీంతో అనిల్ కుమార్ యాదవ్ మీడియా ముందుకు వచ్చారు. ఎన్నికల్లో ఓటమి తదితర అంశాలపై మాట్లాడారు. రాజకీయాల గురించి తప్పుకుంటా అనే అంశంపై గురించి కూడా మాట్లాడారు.


ఏం జరిగిందంటే..?

‘ గత ఎన్నికల సమయంలో నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని ఛాలెంజ్ చేసింది నిజమే. ఆ సమయంలో నా సవాల్‌ను టీడీపీ నేతలు స్వీకరించలేదు. ఆనాడు ఛాలెంజ్ స్వీకరిస్తే బాగుండేది. అలా కాకుండా ఇప్పుడు ట్రోల్ చేయడం సరికాదు. మంత్రుల నోటి దురుసు వల్ల ఓడిపోయామనే అంశం నిజమైతే సరిదిద్దుకుంటాం. ఏదీ ఏమైనప్పటికీ ప్రజా తీర్పును గౌరవిస్తాం. నరసరావుపేట లోక్ సభలో నాకు ఓటు వేసిన 6 లక్షల మంది ఓటర్లకు ధన్యవాదాలు. ఓటు వేసిన వారిపై దాడులు చేస్తున్నారు. వారికి అండగా ఉంటాం. గెలిచిన వాళ్ళు ప్రజలకు మంచి చేయాలి. ఇచ్చిన హామీలు అమలు చేయాలి. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇస్తాం. ప్రజలకు అందుబాటులో ఉంటాం. మేం పారిపోలేదు. తనకు ప్రతిపక్షంలో ఉండటం కొత్త కాదు. గత పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నాం. మళ్ళీ ఉంటాం.. లోపాలు సరిదిద్దుకుని ముందుకు వెళ్తాం.. ఓడిపోతే కృంగిపోయి మూలన కూర్చునే పరిస్థితి లేదు. కష్టంలో జగన్ వెంటే ఉంటాం.. ఆయనతో నడుస్తాం. మా కార్యకర్తలు, నాయకులపై దాడులు మంచి పద్దతి కాదు, ప్రజలు అన్ని గమనిస్తున్నారు అని’ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.

Updated Date - Jun 13 , 2024 | 03:34 PM