Share News

Teacher Ashok Reddy : చికెన్‌, పొట్టేలు కోసి పెట్టాలా..?

ABN , Publish Date - Dec 09 , 2024 | 04:23 AM

‘పేరెంట్స్‌కు అన్నం పెట్టేకి రూ.పది వేలు ఇచ్చారా..? యా గవర్నమెంట్‌ ఇచ్చింది.? ఎంత ఇచ్చింది.. చెప్పండి. ఇచ్చిన రూ.3 వేలతో చికెన్‌, పొట్టేలు కోసి పెట్టాలా.?’ అంటూ అనంతపురం జిల్లాకి చెందిన వైఎ్‌సఆర్‌ ఉపాధ్యాయ సంఘం (టీఏ) నాయకుడు, టీచర్‌ అశోక్‌కుమార్‌ రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వంపై నోటి దురుసు ప్రదర్శించారు.

Teacher Ashok Reddy : చికెన్‌, పొట్టేలు కోసి పెట్టాలా..?

  • పేరెంట్‌ టీచర్‌ మీటింగ్‌లో ప్రభుత్వంపై టీచర్‌ అశోక్‌రెడ్డి ఫైర్‌

  • ఆయన వైఎ్‌సఆర్‌ ఉపాధ్యాయ సంఘం నాయకుడు

  • అనంతపురం జిల్లాలో ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి

అనంతపురం విద్య, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ‘పేరెంట్స్‌కు అన్నం పెట్టేకి రూ.పది వేలు ఇచ్చారా..? యా గవర్నమెంట్‌ ఇచ్చింది.? ఎంత ఇచ్చింది.. చెప్పండి. ఇచ్చిన రూ.3 వేలతో చికెన్‌, పొట్టేలు కోసి పెట్టాలా.?’ అంటూ అనంతపురం జిల్లాకి చెందిన వైఎ్‌సఆర్‌ ఉపాధ్యాయ సంఘం (టీఏ) నాయకుడు, టీచర్‌ అశోక్‌కుమార్‌ రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వంపై నోటి దురుసు ప్రదర్శించారు. కూటమి సర్కారు శనివారం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పేరెంట్‌ టీచర్‌ మీటింగ్‌ (పీటీఎం) సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనంతపురం రూరల్‌ మండలంలోని తాటిచెర్ల ఆదర్శ పాఠశాల ఆవరణలో ఉన్న జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో అశోక్‌కుమార్‌రెడ్డి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయనతోపాటు మరో టీచర్‌ సరిగ్గా విధులకు రాకపోవడంపై గ్రామస్థులు, విద్యార్థులు ఆయనను ప్రశ్నించారు. నాడు-నేడు పనుల్లో అవినీతి, ఐఎ్‌ఫపీ ప్యానల్స్‌ ఇప్పటి వరకూ బిగించకపోవడంపైనా అసహనం వ్యక్తంచేశారు. ఇదే సమయంలో తరగతి గదిలో విద్యార్థులు మధ్యాహ్నమైనా ఇంతవరకు భోజనం పెట్టలేదనీ, తమ తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటని నిలదీశారు. అప్పటికే కూటమి సర్కారుపై అక్కసుతో ఉన్న అశోక్‌కుమార్‌రెడ్డి ఒక్కసారిగా రెచ్చిపోయారు.

‘పేరెంట్స్‌కు అన్నం పెట్టేందుకు రూ.10 వేలు ఇచ్చారా..? యా గవర్నమెంట్‌ ఇచ్చింది.? ఎంత ఇచ్చింది చెప్పండి. ఆ హెడ్‌మాస్టర్‌ను పిల్చుకురాపోండి.? ఎంతిచ్చారో.. ఏమిచ్చారో.. పెద్ద క్వశ్చన్లు వేస్తున్నారు. అన్నింటికీ కలిసి రూ.3 వేలు వేశారు. అది తీసుకొచ్చి ఇచ్చా. ఇంకా ఎక్కడన్నా ఎత్తుకొత్తారా..? ఏందో గవర్నమెంట్‌ నుంచి వచ్చిందంటా.. ఏం చికెన్లు, పొట్టేళ్లు కోసి పెడతారా.? అంతా ఓవరాక్షన్‌ చేస్తున్నారు’ అంటూ ఆక్రోశం వెళ్లగక్కారు. అశోక్‌కుమార్‌ రెడ్డి కొంతకాలంగా పాఠశాలకు రాకుండా ఒక వలంటీర్‌తో చదువు చెప్పిస్తున్నారు. పీటీఎం సందర్భంగా పాఠశాలలో ఘర్షణ తలెత్తడంతో మధ్యాహ్నం 3 గంటల తర్వాత భోజనాలు పెట్టారని తెలిసింది.

Updated Date - Dec 09 , 2024 | 04:23 AM