Share News

AP Politics: జగన్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడుదాం: వసంత కృష్ణ ప్రసాద్

ABN , Publish Date - Mar 30 , 2024 | 09:26 PM

స్థానిక సంస్థలను వైసీపీYSRCP) ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మైలవరం టీడీపీ(TDP) అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్(Vasantha Krishna Prasad) అన్నారు. శనివారం నాడు రాయనపాడులో తెలుగుదేశం - జనసేన - బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధ్వంసకరమైన వ్యక్తుల మధ్య ఇమడలేక పోయానని అన్నారు.

AP Politics: జగన్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడుదాం: వసంత కృష్ణ ప్రసాద్

ఎన్టీఆర్ జిల్లా(విజయవాడ): స్థానిక సంస్థలను వైసీపీ YSRCP) ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మైలవరం టీడీపీ (TDP) అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ (Vasantha Krishna Prasad) అన్నారు. శనివారం నాడు రాయనపాడులో తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి నేతలు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధ్వంసకరమైన వ్యక్తుల మధ్య ఇమడలేక పోయానని అన్నారు. వైసీపీ టికెట్ ఇస్తానన్నా పోటీ చేయదలచుకోలేదని చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నో త్యాగాలు చేశారన్నారు. ప్రజాస్వామ్యం ముసుగు తొడుకున్న నియంతృత్వ పాలనకు చరమగీతం పాడుదామని వసంత కృష్ణ ప్రసాద్ పిలుపునిచ్చారు.

TG Politics: కాంగ్రెస్‌లోకి నందమూరి సుహాసిని.. కీలక పదవి!

కక్షలు, కార్పణ్యాలతో దాడుల సంస్కృతిని ప్రోత్సహిస్తున్న విధ్వంసకరమైన వ్యక్తుల మధ్య ఇమడలేకపోయనని చెప్పారు. అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ ఇస్తానన్నప్పటికీ పోటీ చేసేందుకు విముఖత చూపానని తెలిపారు. పవన్ కళ్యాణ్ త్యాగాలు స్ఫూర్తిదాయకమన్నారు. పవన్ కళ్యాణ్ ఆకాంక్షల మేరకు ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రం నిధులను పంచాయతీలకు ఇవ్వకుండా ఏపీ ప్రభుత్వం జమ చేసుకుందని వసంత కృష్ణ ప్రసాద్ మండిపడ్డారు.

AP Politics: చంద్రబాబు నుంచి బండారుకు పిలుపు.. వైసీపీ బంపరాఫర్లు!


ఈ ప్రభుత్వంలో శాసనసభ్యుడు, వార్డు సభ్యుడు అయినా ఒకటేనని చెప్పారు. ప్రజాప్రతినిధులను సీఎం జగన్ కీలు బొమ్మల్లాగా చేశారని ధ్వజమెత్తారు. ఆయన చేపట్టిన అధికార వికేంద్రీకరణకు అర్ధం లేకుండా చేశారని అన్నారు. మాట తప్పను, మడమ తిప్పనని చెప్పిన ముఖ్యమంత్రి రాజధాని విషయంలో మన ప్రాంతానికి అన్యాయం చేసి మాట తప్పి మడమ తిప్పారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ఇక్కడే ఇల్లు కట్టుకుంటానని చెప్పారని.. ఆ పని ఎందుకు చేయలేదని వసంత కృష్ణ ప్రసాద్ ప్రశ్నించారు.

Congress: కాంగ్రెస్‌లో చేరిన హైదరాబాద్ మేయర్.. సోదరుడు కూడా

గత ఎన్నికలల్లో 151 సీట్లు వచ్చిన తర్వాత అన్ని విషయాలల్లో జగన్ మాట మార్చారని విరుచుకుపడ్డారు. ఏపీకి పరిశ్రమలు రాక, సరైన ఆదాయం లేక నిరుద్యోగుల సంఖ్య పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు రానందుకు వైసీపీకి ఓటు వేయాలా? అని ప్రశ్నించారు. ఏపీని అప్పుల పాలు చేసి యువత, పిల్లల భవిష్యత్తును నాశనం చేసినందుకు వైసీపీకి ఓటు వేయాలా..? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం ముసుగు తొడుకున్న నియంతృత్వ పాలనకు చరమగీతం పాడుదామని వసంత కృష్ణ ప్రసాద్ పిలుపునిచ్చారు.

TG Politics: బీజేపీ గేట్లు తెరిస్తే 48 గంటల్లో కాంగ్రెస్ సర్కార్ కూలుతుంది: మహేశ్వర రెడ్డి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 30 , 2024 | 09:55 PM